Naga Chaitanya: ప్రేమ పెళ్లికి ఒక అర్ధం చెప్పిన సమంత, నాగ చైతన్యను .. అనుకోకుండా విడిపోయారు. ప్రేమించి, పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో సందేహాలు? ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా సరైన కారణం బయటకు రాలేదు. వీళ్ళు ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లవ్ లీ కపుల్ అందరికీ విడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా నాగ చైతన్యకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ ఇక్కడ తెలుసుకుందాం ..
Also Read: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!
వీరిద్దరూ మళ్ళీ కలవాలని చాలా మంది కోరుకున్నారు కానీ, అది జరగలేదు. ఇక జరిగేలా కూడా లేదు. ఎందుకంటే, చైతూ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి ఉంటే చాలా బాగుండేదని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే, ఇప్పుడు బయటకొచ్చిన వార్త ను బట్టి చూస్తుంటే నాగ చైతన్య , సమంత ఉన్నప్పుడే ఇలా ఎందుకు చేశాడని నెటిజన్స్ మండి పడుతున్నారు. మిమ్మల్ని చాలా ప్రేమించింది.. మరి, ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Uppu Kappurambu: కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
తెలిసిన సమాచారం ప్రకారం నాగచైతన్య సమంతకు డివోర్స్ ఇవ్వక ముందే శోభితను బయట కలిసేవాడట. అంతక ముందు నుంచే వీరు ఎఫైర్ నడిపించారని చెబుతున్నారు. కానీ, మన వరకు వచ్చిన సమాచారం మాత్రం సామ్ తో విడాకులు అయ్యాక శోభిత కలసిందని అంటున్నారు. అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
నాగచైతన్య, సమంత కలిసి నటించిన వచ్చిన మజిలీ మూవీలో దివ్యాంశ కౌశిక్ పాత్రకు ముందుగా శోభితను అనుకున్నారట. ఆమె అయితే, ఎఫైర్ తెలిసిపోతుందోనని చైతునే శోభితను రిజెక్ట్ చేసి కొత్త హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. దీనికి సమబందించిన రూమర్లు అయితే, గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక దీనిలో ఎంత వరకు నిజమో? అబద్దమో తెలియాల్సి ఉంది.