Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కన్నప్ప’. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మంచు విష్ణు ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. అమెరికా మొదలుకుని, ఇండియా అంతా ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఆయన నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటంతో.. ఈసారైనా ఈ సినిమా వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా మంచు విష్ణుని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదాలకు గల కారణాలను ఆయన చెప్పుకొచ్చారు. అందుకు ఓ వ్యక్తి కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read- Bunny Vas: పవన్ కళ్యాణ్‌నే ఇరిటేట్ చేశామంటే.. బన్నీ వాసు పోస్ట్ వైరల్
ఓ వ్యక్తి అనగానే అందరూ మంచు మనోజ్ అనే అనుకుంటారు. ఎందుకంటే, ఈ మధ్య మంచు విష్ణుని ప్రతి వేడుకలో ఇమిటేట్ చేస్తూ.. ఇరిటేట్ చేస్తూ వస్తున్నాడు మంచు మనోజ్. అందువల్ల మంచు మనోజ్ అనుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు మంచు విష్ణు చెప్పిన వ్యక్తి మనోజ్ కాదు, విఎఫ్‌ఎక్స్‌లో అంతగా ప్రావీణ్యం లేని వ్యక్తికి ఆ పనిని అప్పగించడం వల్లే, సినిమా విడుదల ఆలస్యమైందని విష్ణు చెప్పుకొచ్చారు. అందుకు తనని తనే నిందించుకున్నారు. దీంతో అంతా ఇప్పుడు ఆ విఎఫ్‌ఎక్స్ పర్సన్ గురించే మాట్లాడుకుంటున్నారు. మంచు మోహన్ బాబు డిసిప్లిన్‌కి కేరాఫ్ అడ్రస్. తన దగ్గర ఎవరైనా తోక జాడిస్తే ఇచ్చి పడేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి నిర్మిస్తున్న సినిమాకు విఎఫ్‌ఎక్స్ విషయంలో ఇంత జరిగితే మోహన్ బాబు ఎలా కామ్‌గా ఉన్నాడా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read- Anaganaga: ఓటీటీ నుంచి థియేటర్లకు.. ఇది కదా సక్సెస్ అంటే!
‘కన్నప్ప’ గురించి తమ్మారెడ్డికి చెబుతూ.. ‘‘ఈ సినిమా ఐడియాను తనికెళ్ల భరణి 2014లో చెప్పారు. అప్పటి నుంచి ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఎంతో మంది నిపుణులతో ఈ ఐడియా డెవలప్ చేయించాను. నాకున్న ఆసక్తిని గమనించిన ఆయన.. ఈ సినిమాను ఇలా కాదు.. భారీగా ప్లాన్ చేయమని సలహా ఇచ్చారు. అంతే, కథని మొత్తం నా వెర్షన్‌లోకి మార్పించేశాను. అయితే ముందు ఈ సినిమాకు మేము రూ. 100 కోట్ల బడ్జెట్ అనే అనుకుని దిగాం. తీరా దిగిన తర్వాత బడ్జెట్ డబులైంది. ఈ సినిమాకు దర్శకుడిని నాన్నే సెలక్ట్ చేశారు. అలా ఒక్కొక్కటి సమకూరుతూ వచ్చాయి. నిజంగా, ఈ సినిమాకు శివుడే ఆజ్ఞ ఇచ్చాడని అనిపించింది. ఈ సినిమాకు పని చేసిన టీమ్ అంతా నాకు ఎంతో సపోర్ట్ అందించారు. ముఖ్యంగా ప్రభాస్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఆలస్యానికి నేను చేసిన తప్పే పెద్ద కారణం. కొత్తవాళ్లని ప్రోత్సహించాలని ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌లో అంతగా ప్రావీణ్యం లేని వ్యక్తికి అవకాశం ఇచ్చి పెద్ద తప్పు చేశాను. ఆ తప్పే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం..’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు