Anaganaga Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Anaganaga: ఓటీటీ నుంచి థియేటర్లకు.. ఇది కదా సక్సెస్ అంటే!

Anaganaga: థియేటర్లలో విడుదలైన నెలకి ఓటీటీలో రావడమనేది ఇప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్. అలాంటిది, ఓటీటీలో విడుదలైన ఓ సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నారంటే.. ఇది కదా సక్సెస్. సినిమా సక్సెస్‌ని కొలవడానికి ఇంతకంటే కొలమానం ఏముంటుంది. సుమంత్‌ హీరోగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించింది. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ఇటీవల ఈటీవీ విన్‌ ఓటీటీలో డైరెక్ట్ రిలీజైన ఈ సినిమా… అందరినీ ఆకట్టుకొని విశేష ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సినిమాకు వస్తున్న స్పందనతో.. థియేటర్లలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Also Read- Bunny Vas: పవన్ కళ్యాణ్‌నే ఇరిటేట్ చేశామంటే.. బన్నీ వాసు పోస్ట్ వైరల్

ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ (Sumanth) మాట్లాడుతూ.. ‘అనగనగా’ సినిమాకు ఇంత సపోర్ట్‌ని ఇచ్చిన మీడియాకు ముందుగా థ్యాంక్స్. అలాగే ఈ సెలబ్రేషన్స్‌కి వచ్చిన వారికి, ఈ సినిమాలో భాగమైన వారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ‘మళ్లీ రావా’ తర్వాత మళ్లీ అద్భుతమైన అనుభూతిని అందించిన కథ ఈ ‘అనగనగా’. దర్శకుడు సన్నీ, రచయిత దీప్తి ఎంతో చక్కగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాను శేష్‌కి చూపించాను. అప్పుడు తను చాలా ఎమోషనల్‌ అయ్యాడు. ఈ సినిమాలో విషయం ఉందని చెప్పాడు. శేష్ చెప్పిన ఆ విషయాన్ని ప్రేక్షకులు అందరూ కూడా బలపరిచినందుకు థ్యాంక్స్. మేము అనుకున్న దానికంటే అద్భుతంగా ఆదరించారు. బేసిగ్గా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఓటీటీలలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు సినిమాని కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులందరూ బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నారు.

Also Read- Spirit: వాళ్లు, వీళ్లు కాదు.. ‘స్పిరిట్’ హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా ప్రకటించేశారోచ్!

హీరో అడివి శేషు (Adivi Sesh) మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది ఒక ఫ్యామిలీ వేడుకలా అనిపిస్తుంది. నా ఫస్ట్ సినిమాకి సుమంత్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన అప్పటినుంచి నాకు ఫ్యామిలీనే. ఈ చిత్రంలో వ్యాస్‌ పాత్రను సుమంత్‌ అంత బాగా చేయడానికి కారణం.. ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకూ అలా ఉండటమే అని నేను భావిస్తున్నాను. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించాడు. నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపూ.. ఇలాంటి సినిమాను థియేటర్లలో కదా చూడాల్సింది అని అనిపించింది. అది నిజమవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో రామ్‌ పాత్ర నాతో కూడా కంటతడి పెట్టించింది. ఈ సినిమా నన్నెంత ఏడిపించిందో.. అంతే నవ్వించింది.. ప్రేమలో పడేసింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు నాకు తెలిసి ఇదొక జీవితం. ఈ సినిమా చూసినప్పటి నుంచి అద్భుతమైన సక్సెస్ అవుతుందని నమ్మాను. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడండి. కుదిరితే బిగ్ స్క్రీన్‌లో చూడండి. ఈ సినిమాకు పని చేసిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు