Mouli Tanuj
ఎంటర్‌టైన్మెంట్

Mouli Tanuj: నా సినిమాను ఎవరైనా విమర్శిస్తే.. ఏం చేస్తానంటే?

Mouli Tanuj: మౌళి తనూజ్.. ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న పేరు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత ఈ కుర్ర హీరో బాగా ఫేమస్ అయ్యారు. అలాగే ఆ మధ్య ఎన్నికల సమయంలో ఓ పార్టీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిత్యం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడాయన హీరోగా, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను సెప్టెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో మౌళి తనూజ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. (Mouli Tanuj Interview)

Also Read- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!

ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు

‘‘నేను ఇండస్ట్రీ రైటర్ కమ్ డైరెక్టర్ అవుదామనే వచ్చాను. చదువుకునే రోజుల్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా. బీటెక్ చదువుతూ.. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసేవాళ్లం. ఈ ప్రాసెస్‌లో నాకు స్క్రిప్ట్స్ మీద అవగాహన వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చాక నటుడిగా అవకాశం వచ్చింది. అలా ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’తో అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాను. ‘లిటిల్ హార్ట్స్’ కథ విన్నప్పుడే ఇది థియేట్రికల్‌గా బాగుంటుందని నిర్ణయించుకున్నాం. ఈటీవీ విన్ వాళ్లు కూడా మా నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ జాయిన్ కావడంతో మా మూవీకి గ్రాండ్ రిలీజ్ దొరికింది. ఇప్పుడు చేసే ప్రయత్నమంతా థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని రప్పించడం కోసమే. మా ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే తీసుకురాగలిగాం. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం స్క్రిప్ట్ సైడ్ కూడా నేనే వర్క్ చేశా. కొత్తగా ఉండేలా ప్లాన్ చేశాం. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూప్‌ల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఒక్క యూత్ కోసమే చేసిన సినిమా అయితే కాదు. థియేటర్స్‌లో సినిమా సస్టెయిన్ అవ్వాలంటే యూత్‌తో పాటు ఆడియెన్స్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఈ సినిమాలో అలాంటి కంటెంట్ ఉంది.

Also Read- Tunnel Telugu Trailer: అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠిల ‘టన్నెల్‌’ ట్రైలర్ ఎలా ఉందంటే?

ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు

నా వరకు నేను వీలైనన్ని మంచి చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఓ పదేళ్ల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేశాననేది.. ఎవరికీ గుర్తుండదు. కానీ, నేను చేసిన మంచి సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అలాగే నేను రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ డ్రీమ్ కూడా భవిష్యత్‌లో నెరవేర్చుకుంటా. ప్రజంట్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నా. ఇప్పుడు నటుడిగా అవకాశాలు వస్తుండటంతో నటనపైనే దృష్టి పెట్టాను. మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. నేను కూడా ఇక్కడ స్థిరపడగలనని మా ఫ్యామిలీ నమ్మలేదు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత వారికి కూడా కొంత నమ్మకం ఏర్పడింది.

పాజిటివ్‌గానే తీసుకుంటా

సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేప్పటి నుంచే నాకు విమర్శలు అలవాటయ్యాయి. రేపు మా సినిమా టికెట్ కొని థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులలో కొందరికి మా సినిమా నచ్చకపోవచ్చు. వారు ఏదైనా విమర్శిస్తే పాజిటివ్‌గానే తీసుకుంటాను. నిజంగా ఏదైనా లోపం ఉంటేనే విమర్శిస్తారు. ఆ లోపాన్ని మనం సరిచేసుకుంటే ఇంకా పైకి ఎదుగుతామని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమా హిలేరియస్ రోమ్ కామ్ మూవీ. థియేటర్స్‌కు వచ్చిన వారందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు వేసిన ప్రీమియర్స్‌కు చాలా మంచి టాక్ వచ్చింది. ఆ టాక్‌తో మా కాన్ఫిడెంట్ మరింతగా పెరిగింది. నా నెక్ట్స్ మూవీకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నాను. త్వరలో ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం