Love Story Begins Movie: ఇప్పుడొస్తున్న జనరేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మల్టీ టాలెంట్‌తో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి, ఈ రోజు పెద్ద డైరెక్టర్స్‌గా మారిన వారు ఉన్నారు. చిన్న హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడిలాంటి జాబితాలో చేరేందుకు తెలుగు మూలాలు కలిగిన తమిళ చిచ్చర పిడుగు మిథున్ చక్రవర్తి (Mithun Chakravarthi) రెడీ అవుతున్నారు. 21 ఏళ్ల ఈ కుర్రాడు హీరోగా, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ బిగిన్స్’. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైందీ చిత్రం. తాజాగా ఈ చిత్ర అప్డేట్‌తో వచ్చారు మేకర్స్.
Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్
వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించేలా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ బిగిన్స్’. మిథున్ చక్రవర్తి సరసన వర్ష – శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని హీరో-హీరోయిన్లపై చిత్రీకరించిన ‘వస్తావా’ అనే సాంగ్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మేకర్స్ విడుదల చేశారు. అమర్ గీత్ సంగీత సారధ్యంలో శివమణి రాసిన ఈ పాటను భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ ఆలపించారు. హైదరాబాద్‌లోనే కాకుండా, ఇదే పాటను దుబాయి నుంచి కూడా మేకర్స్ విడుదల చేయడం విశేషం.

పాట విడుదల అనంతరం హీరో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమాలే లోకంగా, సినిమాలే ప్రాణంగా పెరిగాను. ఇక సినిమాలే నా జీవితం అని ఫిక్సయిపోయాను. నా జీవితంలో జరిగిన ఒక యదార్ధ సంఘటనని ఆధారంగా చేసుకుని, దానికి కొన్ని కమర్షియల్ విలువలు, బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్, రవ్వంత సందేశం జోడించి ఈ ‘లవ్ స్టొరీ బిగిన్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పగలను. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దుబాయిలో సైతం షూటింగ్ జరుపుకునే ఈ మూవీని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?
Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్