mister reddy ( image source:x)
ఎంటర్‌టైన్మెంట్

Mister Reddy: ‘మిస్టర్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇదీ నా కథే అంటున్న నిర్మాత

Mister Reddy: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ మ్యాన్ రాజా తెలియని వారుండరు. ఎక్కడికి వెళ్లినా ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోల్డ్ మ్యాన్ రాజా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’ (Mister Reddy). ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 18న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాదులో నిర్వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి తారాగణం ముఖ్య పాత్రల్ని పోషించారు. కెమెరామెన్‌గా నాగ భూషణ్ వ్యవహరించారు.

Also Read – ChatGPT: చాట్‌జీపీటీ చిట్కా.. యువతిలో ఊహించని మార్పు

హీరో, నిర్మాత టీఎన్‌ఆర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ రెడ్డి’ సినిమా తీయడం కోసం చాలా కష్టపడ్డానన్నారు. ఈ సినిమా ఇలా రావడానికి ఎంతో మంది చేతిలో మోసపోయానని తెలిపారు. అయినా సరే సినిమాను ఎక్కడా తగ్గకుండా నిర్మించానన్నారు. తన టాలెంటే తనను ఇక్కడి వరకూ తీసుకొచ్చిందని దానిని బాగా నమ్ముతానని తెలిపారు. ఈ సినిమా తన జీవితంలో జరిగిన కథే అంటూ చెప్పుకొచ్చారు. ఇందులో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు సపోర్టు చేయాలని కోరారు. హీరో మహదేవ్ మాట్లాడుతూ.. సినిమాకు సపోర్టు చేసిని అందరికీ మంచి సినిమాను ఇవ్వబోతున్నామని అన్నారు.

Also Read – Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ సెన్సార్ పూర్తి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు నిర్మాత, హీరో టీఎన్‌ఆర్ నాకు చాలా సహకరించారు. మహదేవ్, అనుపమ, దీప్తిల నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాగ భూషణ్ అద్భుతమైన విజువల్స్ ఇవ్వడంతో సినిమా మరింత బాగా వచ్చింది. టీం అంతా కూడా నాకు బాగా సహకరించడంతో ఇంత మంచి సినిమా తీయగలిగాను. వారు అంతా నా వెనక ఉండి నడిపించడం వల్లే ఇది సాధ్యపడింది. ఈ సినిమాను టీం మొత్తంతో కలిపి చూశాను. చాలా బాగా వచ్చింది సినిమా మొత్తం. రాజన్న యాక్షన్ సీక్వెన్స్‌ను సినిమాకే హైలెట్ గా ఉండనుంది.’ అని దర్శకుడు వెంకట్ వోలాద్రి అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Kishan Reddy: రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా

MGNREGA: ఉపాధి హామీ నిధుల రికవరీ పై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్!

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు