Teja Sajja
ఎంటర్‌టైన్మెంట్

Teja Sajja: సూపర్ హీరో తేజ సజ్జాను మరోసారి లాక్ చేసిన ‘మిరాయ్’ మేకర్స్

Teja Sajja: ‘హను-మాన్’ (Hanu Man) మూవీతో దేశవ్యాప్తంగా ఫేమ్, క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja). ఆ సినిమా తర్వాత మరోసారి తన ప్రతిభ చూపేందుకు సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆయన సూపర్ యోధ పాత్రలో నటించిన ‘మిరాయ్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 23 తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘మిరాయ్’ మూవీ నుంచి మేకింగ్ వీడియో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, ‘మిరాయ్’ (Mirai) బ్యానర్‌లోనే మరో కొత్త ప్రాజెక్ట్‌ని బర్త్‌డే స్పెషల్‌గా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) కొలాబరేషన్‌లో సెకండ్ మూవీగా రాబోతుందని తెలుపుతూ.. విడుదల డేట్‌ని కూడా లాక్ చేసేశారు.

Also Read- Janaki vs state of Kerala: పండక్కి వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం.. లాయర్లు పోలీసులు కూడా!.. ఈ కోర్డ్ డ్రామా మిస్‌కాకండి

నిజంగా తేజ సజ్జాకు ఇది అనుకోని సర్‌ప్రైజ్ అనుకోవచ్చు. ఆయన కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది.. సరైన ప్రాజెక్ట్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిద్దరు అయితే ఒకటి, లేదంటే రెండు సినిమాలతోనే దుకాణం సర్దేశారు. కానీ తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపును పొంది ఉండటం, అలాగే స్టార్ హీరోలందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఉండటం ఆయనకు బాగా కలిసొస్తుంది. అలాగే స్టార్ హీరోలందరితోనూ మంచి రాపో మెయింటైన్ చేయడం కూడా తేజ సజ్జా సక్సెస్‌కు కారణంగా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో హీరోలందరూ తేజ సజ్జా అంటే ఇష్టపడతారు. ఇక ఆయన ఎంచుకునే స్ర్కిప్ట్‌లు కూడా ప్రేక్షకులకు తేజాని దగ్గర చేస్తున్నాయి.

ప్రశాంత్ వర్మతో చేసిన ‘హనుమాన్’ సినిమాలో తేజ సజ్జా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చేస్తున్న సూపర్ యోధ చిత్రం ‘మిరాయ్’ కూడా గ్యారంటీ సక్సెస్ అనేలా ప్రమోషనల్ కంటెంట్ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లింది. అలాగే ఈ సినిమా బిజినెస్ కూడా చాలా మంచిగా జరగడంతో.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఇలాంటి హీరోని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే వెంటనే మరో సినిమాకు లాక్ చేశారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త సినిమా కూడా ‘మిరాయ్’ తరహాలోనే గ్రాండ్ స్కేల్‌లోనే తెరకెక్కబోతుందని నిర్మాతలు తెలిపారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.

Also Read- Beauty Teaser: పేరుకే ‘బ్యూటీ’.. అంతా ఎమోషనల్.. ‘బ్యూటీ’ టీజర్ ఎలా ఉందంటే?

ఈ సినిమా అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. బ్లాక్, రెడ్ షేడ్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్‌లో ‘రాక్ ఆన్’ జెశ్చర్ చేస్తూ ఓ చేయి కనిపిస్తుంది. చేతిలో గేమ్ కంట్రోలర్ పట్టుకుని ఉండటం ఇంకాస్త క్యురియాసిటీని పెంచింది. ‘From Rayalaseema to the end of the world’ అనే ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ కథ రూట్స్‌కి రీజనల్ టచ్, స్టోరీ స్కేల్‌లో గ్లోబల్ రేంజ్‌లో ఉండబోతుందని సూచిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి 2027కి గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఈ ప్రకటనలో అధికారికంగా తెలియజేశారు. మరో వైపు ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జా ‘జై హనుమాన్’ చేయాల్సి ఉందనే విషయం తెలియంది కాదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!