Mirai Still
ఎంటర్‌టైన్మెంట్

Mirai: ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. జంట భలే ఉంది!

Mirai: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమాతో దేశవ్యాప్తంగా నేమ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇప్పుడాయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రకరకాల వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా సాంకేతిక వర్గంలో బీభత్సంగా మార్పులు జరిగాయని, నిర్మాతలు మనీ ఇవ్వడం లేదని.. ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి. కానీ, నిర్మాతలు మాత్రం ఆ రూమర్స్‌పై స్పందించకుండా, సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

Also Read- Usurae: హీరో, హీరోయిన్‌‌లని కొట్టా.. సీనియర్ హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్స్

ఈ టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన కథ, ఫాంటసీ యూనివర్స్‌తో ‘మిరాయ్’ సూపర్ హీరో జానర్‌ని రీడిఫైన్ చేయబోతుందనేలా ప్రామిస్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జూలై 26న విడుదలయ్యే ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది’తో ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ ఓ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా ఓ హై ఎనర్జీ టెక్నో బీట్ సాంగ్ ఇదనేది అర్ధమౌతోంది. లీడ్ పెయిర్ తేజ సజ్జా – రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది.

Also Read- Prabhas: బాహుబ‌లి పాత్ర కోసం.. ప్ర‌భాస్ రోజుకి అన్ని గుడ్లు తీసుకున్నాడా.. డైట్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!

ఈ పిక్‌లో తేజ సజ్జా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో రఫ్ అండ్ టఫ్‌గా, హీరోయిక్ ఆరాతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తే.. రితికా గ్లామరస్‌గా, తేజను ఇంటెన్స్‌గా చూస్తూ ఓ బ్యూటీఫుల్ మూడ్‌ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ డ్రాప్‌లో మెరిసే గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ మ్యాజికల్ ఫీల్ ఇస్తూ, మిరాయ్ మైథో-ఫాంటసీ టచ్‌ను కలిగిస్తోంది. మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ‘కార్తికేయ 2, జాట్’ వంటి హిట్స్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మిస్తోంది. ‘మిరాయ్’తో పాన్-ఇండియా స్థాయిలో మరింత ముందడుగు వేస్తోందీ సంస్థ. ఆల్రెడీ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా మంచి ఊపు మీద ఉందని తెలుస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమా లాభాల బాటలో ఉన్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!

Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!

Telangana Politics: కాంగ్రెస్ స్కెచ్‌కి ఇరుక్కుపోయిన బీఆర్ఎస్.. ఎలా అంటే..?

OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్