Shashirekha Song: మెగాస్టార్ ‘శశిరేఖ’ సాంగ్ వచ్చేసింది..
sasi-rekha-lirical-video(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Shashirekha Song: ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ సాంగ్ వచ్చేసింది..

Shashirekha Song: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సాధిస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ జోష్‌ను మరింత పెంచుతూ, చిత్ర బృందం తాజాగా రెండో పాట ‘శశిరేఖ’పాటను విడుదల చేసింది. తాజాగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిత్రంలో నయనతార పోషిస్తున్న పాత్ర పేరు’శశిరేఖ’ కావడం ఈ పాటకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన పాట ప్రోమో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

Read also-Akhil Project: అఖిల్ ‘లెనిన్’ తర్వాత చేయబోయేది ఆ దర్శకుడితోనేనా?.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

తాజాగా విడుదలైన పాటలో చిరంజీవి, నయనతార స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. మెగాస్టార్ తనదైన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొడుతుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.’శశిరేఖ’ పాట కూడా ‘మీసాల పిల్ల’ లాగే విజువల్‌గా చాలా కలర్‌ఫుల్‌గా, డ్యాన్స్ నంబర్‌గా కనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మరోసారి మెగా అభిమానులను హుషారెత్తించేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి పడవపై ప్రయాణిస్తూ.. శశిరేఖా..ఓ మాట చెప్పాలి చెప్పాకా ఫీలు కాక.. ఓ ప్రసాదూ.. మోమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమికాదు.. అంటూ సాగుతోంది. పాటను చూస్తుంటే.. నయనతార బాగా సంపన్న కుటుంబంలో ఉండి, మెగాస్టార్ ఏమీ లేనివాడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ పాటలో. భీమ్స్ సంగీతంతో పాటు ఈ పాటను కూడా పాడారు. ఈ ఓవరాల్ గా చూస్తుంటే ఈ సినిమా మరో చాట్ బాస్టర్ గా నిలిచేలా ఉంది. ఈ పాటను చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఆశక్తి మరింత పెరిగింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Savitri Jayanthi: మహానటి సావిత్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు.. ఆ పాత్రే కనబడేది..

‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చే ఓ మాస్ డ్యాన్స్ నంబర్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఇప్పటికే వెంకటేష్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. సమంత రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చనున్నాయి. వరుస అప్డేట్‌లతో అంచనాలను పెంచుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండో పాట విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు