Megastar Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఆ దేశ పౌరసత్వం.. క్లారిటీ!

Megastar Chiranjeevi: ఇటీవలకాలంలో సినీ, రాజకీయ ప్రముఖులపై రూమర్స్ రావడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలపై రూమర్స్, ఫేక్ న్యూస్ రావడం సర్వ సాధారణం. ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరో, హీరోయిన్ల నుంచి కొత్తగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన వారు సైతం రూమర్స్ భారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఆడియన్స్‌ని అలరించిన మెగాస్టార్.. ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గౌరవారర్ధంగా చిరంజీవికి ఓ దేశం పౌరసత్వం ఇచ్చిందనే ప్రచారం నడుస్తుంది. దీనిపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. చిరంజీవి బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఇదంతా ఫేక్ సమాచారం అని టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు నిర్ధారణ చేకోవాలని కోరింది. తమ నుంచి నిర్ధారణ చేసుకోకుండా ఎలా వార్తలు ప్రచురిస్తారని ప్రశ్నించింది. టీమ్ రెస్పాండ్ తో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది.

అయితే యూకేలో మెగాస్టార్ చిరంజీవికి సన్మానం చేసేందుకు ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమంకు అటెండ్ అయ్యేందుకు రెడీ అయిన చిరంజీవి.. రూమర్స్ ఇలా స్ప్రెడ్ కావడం చాలా బాధ అనిపించిందట. ఇక ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆసక్తిగా చూపించడం లేదట. ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చని అంటున్నారు. ఇటీవలే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌కి వెళ్లి చిరంజీవి స్టేడియంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

Also Read: అభిమాని కామెంట్స్‌కు అనన్య నాగళ్ల షాకింగ్ రియాక్షన్

ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. 70% వరకు చిత్రీకరణ పూర్తి అయినట్టు సమాచారం. ఇందులో త్రిష హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఈ మూవీలో కంపించనున్నదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో చిరు సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్టు టాక్ నడుస్తోంది. మరోవైపు దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ.. ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందని తెలుస్తుంది. అలాగే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి మెగాస్టార్ ఓ మూవీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా హిట్స్‌తో ఖుషిగా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మెగాస్టార్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు సమాచారం. ఇక వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నాడు.

Also Read: హీరోయిన్‌తో కెమిస్ట్రీ.. పోలీస్‌స్టేషన్‌కు డైరెక్టర్ అనిల్ రావిపూడి

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?