Ananya Nagalla: అనన్య నాగళ్ల.. తెలంగాణ అమ్మాయిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా అనన్య షార్ట్ ఫిల్మ్ షాదిలో నటించింది. ఇందులో ఈమె నటనకు గానూ సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ మహిళా నటిగా ఎంపికైంది. ఆ తర్వాత మల్లేశం మూవీతో అనన్య టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీలో డీ గ్లామర్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తోంది ఈ యంగ్ బ్యూటీ. పొట్టేల్, శ్రీకాకుళలం షెర్లాక్ హోమ్స్,డార్లింగ్ వంటి మూవీస్ మంచి విజయాలను తన అకౌంట్లో వేసుకుంది. ఇక అనన్య నాగళ్ల ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలతో పాటు మూవీ అప్డేట్స్, లేటెస్ట్ ఫొటో షూట్‌లను తన అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడపుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన లైఫ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
అయితే యాంకర్ మొదటగా కెరీర్‌లో ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమేంట్ ఏంటని అనన్యని ప్రశ్నించింది. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ పాత్రలు ఏమి చేయలేదని, అయితే ఆ సమయంలో ఓ షాప్ ప్రారంభోత్సవానికి తనను పిలిచారని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభిమాని దగ్గరికి వచ్చి ‘మేడమ్ మీ నడుము చాలా బాగుంది’ అని చెప్పాడని, అయితే దాని వల్ల తనకేమి కోపం రాలేదని చెప్పింది. ఆ కాంప్లిమెంట్ బాగా నచిందని తెలిపింది. అదే తన బెస్ట్ కాంప్లిమెంట్ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే దీనికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కొందరు అనన్యని మెంచుకుంటుండగా.. మరికొందరు ఎగతాళిగా మాట్లాడుతున్నారు.
Also Read: ఫస్ట్ మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే 5 సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ !
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అనన్య నాగళ్ల జన్మించింది. వెంకటేశ్వరరావు-విష్ణు ప్రియ దంపతులకు అనన్య జన్మించింది. ఆమె తండ్రి ఒక బిజినెస్ మాన్, తల్లి హౌస్ వైఫ్. అనన్య చదువు కోసం కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. ఇబ్రహీంపట్నంలోని రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అనన్య బీటెక్ చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసింది. జాబ్ చేస్తున్న సమయంలోనే షార్ట్ ఫిల్మ్ షాదిలో నటించే ఛాన్స్ వచ్చింది. అలా సినీ కెరీర్ మెదలు పెట్టి.. వరుసగా మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.