MSG Boxoffice: మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, 2026 సంక్రాంతి అసలైన విజేతగా నిలిచింది. మెగాస్టార్ వింటేజ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తోడవ్వడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి అంబరాన్నంటుతోంది. ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో అత్యంత వేగంగా బ్రేక్-ఈవెన్ మార్కు వైపు దూసుకుపోతుండటం విశేషం. నైజాం నుండి ఓవర్సీస్ వరకు ప్రతి ఏరియాలోనూ డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. పండుగ సెలవులు ముగిసినా సినిమాకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎగ్జిబిటర్లు అన్ని ప్రధాన నగరాల్లో అదనపు షోలను జోడిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.
Read also-Slumdog Movie: పూరీ, సేతుపతి సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏం ఉంది మామా..
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ వారంతం నాటికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ 250 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతి రేసులో ‘మన శంకరవరప్రసాద్ గారు’ నంబర్ వన్ ఆడియన్స్ ఛాయిస్‌గా నిలిచి, మెగాస్టార్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచింది.
190CRORES+ worldwide gross in 4 DAYS for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
All areas heading towards BREAK-EVEN MARK 💥💥
Extra shows being added in all areas to meet the never-ending demand 🔥🔥🔥#MegaSankranthiBlockbusterMSG is the #1 AUDIENCE CHOICE FOR SANKRANTHI 2026 😎 pic.twitter.com/0CC8fTKSIU
— Shine Screens (@Shine_Screens) January 16, 2026

