Chiranjeevi and Anil Ravipudi
ఎంటర్‌టైన్మెంట్

Mega157: చిరు, అనిల్ రావిపూడి చిత్ర హీరోయిన్ ఫిక్స్.. మరోసారి టాలీవుడ్‌ని రూల్ చేసేందుకు వస్తోంది

Mega157: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ మూవీ రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ చిత్ర విడుదల తేదీ ఎప్పుడనేది ఇంత వరకు క్లారిటీ లేదు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసిన రిక్వెస్ట్‌లతో ఇటీవల ఓ పాటను విడుదల చేశారు. అంతే మళ్లీ ఆ సినిమా టీమ్ సైలెంట్ అయిపోయింది. మరోవైపు అనిల్ రావిపూడి తన ప్రమోషన్స్ స్ట్రాటజీని మాత్రం అస్సలు వదలడం లేదు. చిత్ర ప్రారంభోత్సవం అయిన మరుసటి రోజే, సాంకేతిక నిపుణుల పరిచయం అంటూ.. ఓ థ్రిల్లింగ్ వీడియోను వదిలి అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి ఏదో రకంగా ఈ సినిమా వార్తలలో ఉంటూనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Samantha Subham: ట్రా లా లా లక్ష్యమిదే.. సమంత కోరిక తీరుతుందా?

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలలో ఉన్న విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ.. ఈ సినిమాలో చిరంజీవి సరసన మరోసారి నయనతార నటించబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ‘సైరా నరసింహా రెడ్డి’ కాగా, రెండోవది ‘గాడ్ ఫాదర్’ (సిస్టర్ రోల్). ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట తెరపై కనువిందు చేయబోతున్నారన్నమాట. చిరంజీవి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి హాస్యభరిత పాత్రని ఈ చిత్రంలో చేయబోతున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ షూట్ నుంచి సరాసరి ‘తిరంగా యాత్ర’.. పవన్ చేతిపై టాటూ గమనించారా?

ఇక నయనతార ఈ చిత్రంలో నటిస్తుందని తెలుపుతూ, అనిల్ రావిపూడి స్టైల్‌లో ఓ వీడియోని కూడా విడుదల చేశారు. ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉండటమే కాకుండా, సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇందులో నయనతార తెలుగులో మాట్లాడుతుండటం విశేషం. ముందుగా మేకప్ అవుతున్న నయనతారను చూపించారు. ఆ తర్వాత కారులో ప్రయాణిస్తూ చిరంజీవి క్లాసిక్ పాటలకు వైబ్ అవుతూ, మెగా157 స్క్రిప్ట్‌ను చదువుతుంది నయనతార. చిరంజీవి ఐకానిక్ డైలాగ్‌లలో ఒకదాన్ని ప్రకాశవంతమైన చిరునవ్వుతో చెబుతూ, తన సిబ్బందితో తెలుగులో మాట్లాడుతున్న నయనతారను వీడియోలో చూపించారు. చివరకు, అనిల్ రావిపూడి ఎంటరైన తర్వాత ఇద్దరూ కలిసి ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ మరోసారి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుందనే క్లారిటీని ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి కూడా నయనతారకు స్వాగతం పలికారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం