Chiranjeevi MSG: సెకండ్ సింగిల్ ప్రోమో ‘శశిరేఖ’ వచ్చేసింది..
sasirekha(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi MSG: ‘మనవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ‘శశిరేఖ’ కాదు.. ‘కాత్యాయనీ’..

Chiranjeevi MSG: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మనశంకరవరప్రసాద్ గారు’ (MSG) చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సాధిస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ జోష్‌ను మరింత పెంచుతూ, చిత్ర బృందం తాజాగా రెండో పాట ‘శశిరేఖ’ ప్రోమోను విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్‌తో అభిమానులు సంబారాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 6న ‘శశిరేఖ’ పాట ప్రోమోను విడుదల చేయగా, పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల కానుంది. చిత్రంలో నయనతార పోషిస్తున్న పాత్ర పేరు కూడా ‘శశిరేఖ’ కావడం ఈ పాటకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

Read also-Venkatalachimmi: పాయల్ రాజ్‌పుత్ బర్త్‌డే గిఫ్ట్‌గా షాకింగ్ పోస్టర్ వదిలిన మేకర్స్.. ఈ రేంజ్ టార్చరా?

తాజాగా విడుదలైన ప్రోమోలో చిరంజీవి, నయనతార స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. మెగాస్టార్ తనదైన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొడుతుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.’శశిరేఖ’ పాట కూడా ‘మీసాల పిల్ల’ లాగే విజువల్‌గా చాలా కలర్‌ఫుల్‌గా, డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మరోసారి మెగా అభిమానులను హుషారెత్తించేలా ఉందని ప్రోమో హింట్ ఇచ్చింది. ప్రోమోను చూస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి పడవపై ప్రయాణిస్తూ.. శశిరేఖా..ఓ మాట చెప్పాలి చెప్పాకా ఫీలు కాక.. ఓ ప్రసాదూ.. మోమాటం లేకుండా చెప్పేసేయ్ ఏమికాదు.. అంటూ సాగుతోంది. విజువల్ గా కూడా చాలా కలర్ ఫుల్ గా కనిపించింది.మెగాస్టార్ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ఈ పాట్ మరో మెగాస్టార్ కెరీర్ లో మరో విజువల్ వండర్ అయ్యేలా అనిపిస్తుంది. అయితే ఈ పాట్ ప్రోమోను చూస్తుంటే.. లిటిల్ హార్ట్ సినిమాలో.. ‘కాత్యాయినీ’ బోంచేశావా.. అనే పాటను గుర్తు చేస్తుంది.. దీనిని చూసిన నెటిజన్లు ఇదే పేరడీ సాంగ్ లా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. మర ఇది ఎలా ఉందో తెలియాలి అంటే నవంబర్ 8 వరకూ ఆగాల్సింది. ఈ సాంగ్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Akhanda 2: ‘అఖండ 2’కు రిలీజ్‌ కష్టాలు.. అడ్డంగా బుక్కయిన వేణు స్వామి

‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఫ్యామిలీ, మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చే ఓ మాస్ డ్యాన్స్ నంబర్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఇప్పటికే వెంకటేష్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. సమంత రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చనున్నాయి. వరుస అప్డేట్‌లతో అంచనాలను పెంచుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండో పాట ప్రోమో విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

Just In

01

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా