Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే (HBD Megastar Chiranjeevi) సందర్భంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న Mega157 మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. Mega157, ChiruAnil వర్కింగ్ టైటిల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తుండగా.. శ్రీమతి అర్చన సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. విడుదల చేసిన గ్లింప్స్.. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Chiranjeevi – Bobby: వీరి కాంబినేషన్‌లో మరో సినిమా.. ఈ సారి పూనకాలు డబుల్ లోడింగ్
ఈ టైటిల్ గ్లింప్స్ విడుదల అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్, ఆయన లుక్ పరిచయం చేయాలనుకున్నామని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కం బ్యాక్ తర్వాత మెగా శ్వాగ్ చూడాలని నాకు కోరిక ఉండేది. నాకెప్పుడు అవకాశం వస్తుందా? అని ఎంతగానో ఎదురు చూస్తుండగా.. ఫైనల్‌గా ఆ అవకాశం వచ్చేసింది. మెగాస్టార్‌ని అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ అన్ని అద్భుతంగా వస్తున్నాయి. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఆ పేరులో నుంచి మేము శంకరవరప్రసాద్ తీసుకుని ఈ సినిమాలో ఆయన చేస్తున్న క్యారెక్టర్‌కి పెట్టడం జరిగింది. దాన్నే.. ‘మన శంకరవరప్రసాద్ గారు’గా చేసి సినిమాకి టైటిల్‌గా పెట్టాం. క్యాప్షను పండగకి వస్తున్నారు.
టైటిల్ గింప్స్‌కు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు థాంక్యూ. ప్రస్తుతానికి వాయిస్ మాత్రమే ఇచ్చారు. వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో ఈసారి పండక్కి చూస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్‌కు చాలా థ్యాంక్స్. చిరంజీవి పాట, ఆట, మ్యానరిజమ్స్, ఫైట్స్, లుక్స్.. అభిమానించని వాళ్ళు, అనుకరించని వాళ్ళు ఉండరు. ఎక్కడో ఒకచోట ఆయన ప్రభావం ఉంటూనే ఉంటుంది. అలాంటి మెగాస్టార్‌ను నా కంటితో ఎలా చూడాలనుకున్నానో.. అలా చూసే అవకాశం వచ్చింది. ఈ టైటిల్ గ్లింప్స్ జస్ట్ శాంపిలే.. సినిమాలో ఇంకా చాలా వున్నాయి.
Also Read- Mr Romeo Teaser: ‘మిస్టర్ రోమియో’కు హీరోయిన్ శ్రియా శరణ్ సపోర్ట్
టైటిల్ గ్లింప్స్‌లోని లుక్ కోసం మేము చేసింది కూడా ఏమీ లేదు. ఇందులో కనిపించే చిరంజీవి 95 శాతం ఒరిజినల్. ఈ సినిమా కోసం ఆయన వెయిట్ లాస్ అయ్యారు. చాలా కేర్ తీసుకున్నారు. నా అదృష్టం కొద్దీ అంతా అద్భుతమైన లుక్ దొరికింది. ఈ క్రెడిట్ అంతా మెగాస్టార్‌కే దక్కుతుంది. ఆయన మార్నింగ్, ఈవినింగ్ జిమ్ చేసి లుక్‌ని మెయింటైన్ చేస్తున్నారు. బీమ్స్‌కి ఐడియా చెప్పగానే చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే విజువల్స్ సమీర్ రెడ్డి అదరగొట్టారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ మీ అంచనాలకు తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నారు. అందులో నో డౌట్’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు