Meenakshi Chaudhary: నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను మీనాక్షి చౌదరి మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..
Also Read- Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!
సంక్రాంతి హీరోయిన్
‘‘సంక్రాంతికి ‘గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు’తో వరుసగా వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని ప్రేక్షకులు ఇచ్చారు. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకముంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగిన చాలా మంచి అమ్మాయి. క్యూట్‌గా బిహేవ్ చేస్తుంది. ఇందులో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్‌ని బట్టి, నాకున్న అవగాహనతో ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశా. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను. కానీ, చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్‌గా ఉంటుంది.
Also Read- Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?
నా దృష్టిలో కథే హీరో
నవీన్‌తో వర్క్ చేయడం ఎలా ఉంటుందంటే.. సినిమా టీచింగ్ స్కూల్‌లా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కామెడీగా నడుస్తున్నా.. నా పాత్ర మాత్రం సీరియస్‌గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీతో నిండి ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్‌ని కరెక్ట్ టైమింగ్‌లో చెప్పడం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన ఎన్నో పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్తాను. కామెడీ అనేది చాలా కష్టం. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎంత కామెడీ ఉన్నా.. నా దృష్టిలో మాత్రం కథే హీరో. కథ ఎలా ఉంది? దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది నాకు ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. ఈ పాత్ర నా కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుందా? అని మాత్రమే చూస్తాను. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో రానున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

