Maruthi: ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్’ (Bahubali: The Epic) ప్రమోషన్స్ నిమిత్తం జపాన్‌లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) క్షేమంగా ఉన్నాడని ‘ది రాజాసాబ్’ (The Raja Saab) దర్శకుడు మారుతి (Director Maruthi) తెలియజేశారు. జపాన్‌లోని (Japan) ఉత్తర ప్రాంతాన్ని సోమవారం తీవ్ర భూకంపం (Strong Earthquake) వణికించింది. సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.6 తీవ్రతగా నమోదైన విషయం తెలిసిందే. ఈ భూకంప తీవ్రతకు సముద్రంలో సునామీ అలజడి చెలరేగినట్లుగానూ టాక్ నడుస్తుంది. ఉత్తర జపాన్‌లోని సముద్ర తీరప్రాంతాలలో సముద్ర అలలు 40 సెంటీమీటర్ల వరకు ఎగసిపడ్డాయని జపాన్ వాతావరణ సంస్థ (JMA) కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ప్రభాస్ క్షేమంపై అభిమానులు ఆందోళన చెందుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సాగర్ అనే ప్రభాస్ అభిమాని చేసిన ట్వీట్‌కు మారుతి స్పందించి.. ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని తెలపడంతో.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read- Akhanda 2: బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు ఆయన బిడ్డకు రూ. 10 కోట్లా! ఇలా కూడా ఉంటుందా!
ప్రభాస్ క్షేమంగా ఉన్నారు
‘‘జపాన్‌లో భూకంపం, సునామి హెచ్చరికలు కూడా చేశారంట. హీరో అక్కడే ఉన్నారు. రేపు రిటన్ అవుతున్నాడు అంట’ అని సాగర్ అనే ప్రభాస్ అభిమాని ట్వీట్ చేయగా.. ‘డార్లింగ్‌తో మాట్లాడాను. ఆ హెచ్చరికలు చేసిన టోక్యోలో లేడు. ఆయన క్షేమంగా ఉన్నాడు.. ఎవరూ వర్రీ అవకండి’’ అని మారుతి రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఓసారి రాజమౌళి అండ్ టీమ్ జపాన్‌లో ఉన్నప్పుడు ఇలానే భూకంపం రావడంతో.. అంతా షాకయ్యారు. జపాన్‌లో ఓ హోటల్‌లోని 28వ అంతస్తులో ఉన్నప్పుడు భూకంపం సంభవించిందని, కానీ మేమంతా సురక్షితంగా బయటపడ్డామని రాజమౌళి తనయుడు కార్తికేయ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ స్పెషల్ స్ర్కీనింగ్ నిమిత్తం వారప్పుడు అక్కడ ఉండగా 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజమౌళి కూడా జపాన్ తనకు ఎంతో ఇష్టమైన దేశం అని, అక్కడ భూకంపాల వార్తలు మాత్రం తనని కలచివేస్తాయని ట్వీట్ చేశారు.
Spoke to Darling he is not in Tokyo and doing safe no worries 👍
— Director Maruthi (@DirectorMaruthi) December 9, 2025
Also Read- Krithi Shetty: ఆ అనుభవం లేకపోవడమే కారణమని తెలుసుకున్నా.. బ్రేక్ తీసుకుంటా!
ఇన్నాళ్లకు నా బాహుబలి జపాన్‌లో..
డిసెంబర్ 12న ‘బాహుబలి ది ఎపిక్’ జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్లారు. ప్రభాస్‌తో పాటు రాజమౌళి కూడా జపాన్ వెళ్లాల్సి ఉంది కానీ, ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉండటంతో డార్లింగ్ ఒక్కరే ప్రమోషన్స్ నిమిత్తం అక్కడకు వెళ్లారు. జపాన్‌లో ఉన్న ప్రభాస్‌కు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఓ లెటర్ రాసిన విషయం తెలిసిందే. ఈ లెటర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ లెటర్‌లో ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ.. ‘జపాన్ ఫ్యాన్స్‌కు నువ్వంటే ఎంతో ఇష్టమో.. నీకు ఈ పాటికే అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నేను నాలుగు సార్లు జపాన్ వెళ్లాను. అక్కడకు వెళ్లిన ప్రతిసారి ప్రభాస్ ఎప్పుడు వస్తాడని అడిగేవారు. జపాన్ ప్రభాస్ అభిమానుల కోరిక ఫలించడం ఆనందంగా ఉంది. ఇన్నాళ్లకు నా బాహుబలి జపాన్‌లో సందడి చేస్తున్నాడు’ అంటూ రాజమౌళి ఈ లెటర్‌లో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

