Manchu Vishnu: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసే పోస్ట్‌లు అర్థం కావాలంటే, మినిమమ్ డిగ్రీ అయినా చదివి ఉండాలి. లేదంటే, ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన సినిమాల్లా బుక్కైపోతారు. అలా ఉంటాయ్ ఆయన పోస్ట్‌లు. దేని నుంచి దేనికి లింక్ పెడుతున్నాడో కూడా ఎవరికీ అర్థం కాదు. ఒకసారి ట్రంప్ అంటాడు. ఇంకోసారి బాలీవుడ్ బిగ్ బి అంటాడు. ఇవి రెండు కాకుంటే.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను టార్గెట్ చేస్తుంటారు. అసలు ఈ పోస్ట్‌ల పని లేకపోతే.. చుట్టూ అమ్మాయిలను వేసుకుని, చేతిలో గ్లాస్ పట్టుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఆయన జీవితం సాగిపోతుంది. నిజంగా ఆయనలా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పెట్టి పుట్టాలి. సరేలే.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ గురించి చాలానే చెప్పొచ్చు. అసలు మ్యాటర్‌లోకి వద్దాం..
మంచు ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ‘కన్నప్ప’పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ పేరు మెన్షన్ చేస్తూనే మెయిన్ పాతధారి అయిన మంచు విష్ణును, ఆయన నటను పొడగ్తలతో ముంచెత్తారు. ఇంకేముంది.. ‘కన్నప్ప’ (Kannappa)పై ఆర్జీవీ రియాక్షన్ చూసిన మంచు విష్ణు దాదాపు ఏడ్చినంత పని చేశారు. అవును, ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. తాజాగా మంచు విష్ణు తన ఎక్స్ పోస్ట్‌లో ఆర్జీవీతో జరిగిన వాట్సప్ సంభాషణ స్క్రీన్ షాట్‌ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో కొంత వరకు కనిపించకుండా రఫ్ చేసినా, మిగతా అంతా మాత్రం మంచు విష్ణు నటన అద్భుతం అంటూ ఆయన కొనియాడారు. ఆ సంభాషణలో ఏముందంటే..
‘‘నాకు మొదటి నుంచి దేవుడన్నా, భక్తులన్నా నమ్మకం లేదు. అందుకే ఆ తరహా కథలతో రూపొందే చిత్రాలను నేనసలు చూడను. నేను కాలేజ్ చదివే రోజుల్లో ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను. అందుకు కారణం, అందులో నటించిన నటీనటులు, సాంగ్స్ కోసమే. ‘కన్నప్ప’లో నువ్వు తిన్నడుగా కేవలం నటించడం మాత్రమే చేయలేదు. గొప్ప భక్తి, విశ్వాసంతో నిండిన వ్యక్తిలా కనిపించావు. అసలు కొన్ని సన్నివేశాల్లో అయితే ఊపిరి బిగిపట్టి అలా చూస్తూనే ఉండిపోయాను. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శివలింగం కళ్ల నుంచి పడుతున్న బ్లడ్ ఆపేందుకు తిన్నడు రెండు కళ్లను సమర్పించే సీన్‌లో నీ నటన అద్భుతంగా ఉంది. నాస్తికుడినైన నాకు అలాంటి సన్నివేశాలు అస్సలు నచ్చవు. కానీ నీ నటనతో నాకు నచ్చేలా, నేను ఇష్టపడేలా చేశావు. ఆ పరమశివుడి భక్తుడిగా మారే క్రమంలో నువ్వు చూపించిన నిబద్ధత మాస్టర్ క్లాస్. ఆ టైమ్‌లో నీ ఫేస్ నుంచి వచ్చిన హావభావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిన భక్తి కళాఖండాలు. ప్రభాస్ ఉన్నాడని అంతా థియేటర్లకు వస్తున్నారు కానీ, నేను మాత్రం నిన్ను చూడడానికే మళ్లీ టికెట్ కొనుక్కుని థియేటర్‌కి వెళుతున్నాను’’ అని వర్మ వాట్సప్ మెసేజ్ చేశారు.
Also Read- Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’కి ఏడాది.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్ వైరల్!
ఈ మెసేజ్‌కి మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. రామూ గారు.. జస్ట్ నన్ను ఏడిపించేశారంతే. చాలా రోజులుగా నేను కన్నీళ్లను ఆపుకుంటున్నాను. ఇలాంటి మూమెంట్ ఒకటి వస్తుందనే నమ్మకంతోనే ఇన్ని రోజులుగా పని చేస్తున్నాను. ఎందుకంటే, ఈ సినిమా జర్నీ నాకు పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఎక్కడికి వెళ్లినా, ఈ సినిమాపై అనుమానం వ్యక్తం చేయడం లేదంటే ధ్వేషించడమే చూశాను’’ అని వర్మ మెసేజ్‌కు రిప్లయ ఇచ్చారు. ఇక ఈ సంభాషణను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నటుడిగా నా డ్రీమ్ సాకారమైందని మంచు విష్ణు పేర్కొన్నారు. మరోవైపు ఈ పోస్ట్‌కు నెటిజన్లు కొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వర్మ టీజ్ చేసిన విషయాన్ని కూడా, విష్ణు ఇలా బహిరంగంగా చెప్పుకుంటున్నాడంటూ చీప్ కామెంట్స్ చేస్తున్నారు.
This text message is like a dream come true for the actor in me. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/cB4CEjcmGo
— Vishnu Manchu (@iVishnuManchu) June 28, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు