Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). 27 జూన్ 2025తో ఈ సినిమా వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ (Big B Amitabh Bachchan) చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా మొదటి పార్ట్‌లో తను నటించడం ఎంతో గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు. దర్శకనిర్మాతలు ఎప్పుడంటే అప్పుడు సీక్వెల్‌లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా బిగ్‌బి తన పోస్ట్‌లో చెప్పారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Also Read- Naga Chaitanya: శోభిత, నేను ఆ రూల్స్ పెట్టుకున్నాం.. ఫస్ట్ టైమ్ పర్సనల్ మ్యాటర్ చెప్పిన చైతూ!
ముందుగా ఈ సినిమా వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా వైజయంతీ మూవీస్ బ్యానర్ ఓ పోస్ట్ చేసింది. ఎపిక్ చిత్రానికి వన్ ఇయర్ పూర్తయింది. ఈ జర్నీలో సహకరించిన, సినిమాను సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు అని ఆ పోస్ట్‌లో పేర్కొనగా, ఈ పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ.. బిగ్ బి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇంత గొప్ప చిత్రంలో నేను భాగమైనందుకు నాకెంతో గౌరవంగా ఉంది. వైజయంతీ ఫిల్మ్‌తో పాటు ఈ సినిమాలో భాగమైన పెద్దవారంతా ఇచ్చిన ఆశీస్సులు నాకెప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. మరోసారి ఈ సినిమాలో పార్ట్ అయ్యేందుకు.. వారు ఎప్పుడు అడిగితే అప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను’’ అని బిగ్ బి అమితాబ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read- Ileana: రెండో బిడ్డకు జన్మినిచ్చిన ఇలియానా.. సెలబ్రిటీలు ఆపుకోలేకపోతున్నారు
2024లో వచ్చిన ‘కల్కి 2898 AD’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఫిల్మ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, విడుదలైన అన్ని చోట్ల ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని కలెక్షన్ల సునామీ సృష్టించింది. బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్సల్ నటుడు కమల్ హాసన్, రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, బ్రహ్మానందం, దిశా పటానీ వంటి వారంతా ఈ సినిమాలో భాగమయ్యారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను విజువల్ వండర్‌లా రూపొందించి, సీక్వెల్‌పై భారీ అంచనాలను పెంచేశారు. ‘కల్కి 2898 AD’ సీక్వెల్ ప్రభాస్ కర్ణుడి పాత్ర, అమితాబ్ అశ్వథామ పాత్ర హైలెట్‌గా సాగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే టీమ్ సెట్స్‌పైకి వెళ్లనుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బి ట్వీట్‌తో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.
my honoured privilege to be asked to be a part of it .. one that I admired and respected the blessings of Vijayanti films and the elders that ran and connected with it .. ever to be a part of it any day again , IF THEY WERE TO EVER TO ASK .. https://t.co/QkJWGqxYYk
— Amitabh Bachchan (@SrBachchan) June 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు