Micro Dramas: కొత్త దర్శకులను ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు..
vishnu(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?

Micro Dramas: కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే విధంగా మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. కొత్త ఏడాది కొత్త దర్శకులతో పది నిమిషాల నిడివి గల షాట్ ఫిల్మి తీసేందుకు సిద్ధమయ్యారు. దని గురంచి ఇది వరకే ప్రణాళిక కూడా ఇచ్చారు. అయితే అది ఎప్పటి నుంచి అనేది మాత్రం అప్పడు చెప్పలేదు. తాజాగా దీని గురించి అప్డేట్ ఇచ్చారు. పది నిమిషాల ఫిల్మి పది కోట్లు అంటూ ఓ పోస్టర్ వదిలారు. దీని గురించి మరింత తెలుసుకోవాలి అంటే జనవరి 15 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజు పూర్తి వివరాలు తెలుపుతా అన్నారు. మంచు విష్ణు మైక్రో డ్రామాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. అదే అయితే టాలెంట్ ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే ‘కన్నప్ప’తో పాన్ ఇండియా స్థాయిలో మంచు విష్ణు అందరికీ సుపరిచితం అయ్యారు. ఇలా మైక్రో డ్రామాలను కూడా ఎంకరేజ్ చేస్తే ఆయన స్థాయి మరింత పెరుగుతుంది. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రో డ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు.

Read also-Kingdom Sequel Cancelled: ‘కింగ్డమ్ 2’ ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్‌తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా భావిస్తున్నారు. తరువాతి తరం కథలను ఎలా చెబుతుంది? అసలు ఎలాంటి కథలు తెరపైకి వస్తాయి? అని చర్చించుకునే స్థాయికి చేరుకున్నారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా విష్ణు అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ మైక్రో డ్రామాలతో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు’ అని అనుకుంటున్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.

Read also- Mana ShankaraVaraprasad Garu: నయన తారతో వేరే లెవెల్ ప్రమోషన్స్ చేయిస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఏం లేదా..

ఇప్పటికే మంచు విష్ణు నటించిన  ‘కన్నప్ప’ పాన్-ఇండియా స్థాయిలో మంచి టాక్ తెచ్చుకుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు, విష్ణు నిర్మించిన ఈ సినిమా భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. 200 కోట్ల బడ్జెట్‌తో న్యూజిలాండ్, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరిగింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. తిన్నడు (విష్ణు) గత జన్మ రహస్యం, కన్నప్పగా మారిన కథ ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, నటనకు ప్రశంసలు లభించాయి. సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురైనా, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ సంపాదించింది.

Just In

01

Govt Employees: సర్కారు ఉద్యోగుల సమస్యలకు చెక్?.. సీఎం రేవంత్ కీలక సందేశం

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kishan Reddy: బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఎక్కడక్కడంటే?

The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు

New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?