Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరో మోహన్ బాబు ఫ్యామిలీ కథే వేరు. ఎందుకంటే, గత కొంత కాలం నుంచి సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువ నిలుస్తున్నారు. ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలను నలుగురికీ తెలిసేలా మీడియా ముందుకు వచ్చారు. ఇక తమ్ముడు మంచు మనోజ్ కు అన్న విష్ణుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. సినిమా ఫంక్షన్లో కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా 9 ఏళ్ల తర్వాత మనోజ్ భైరవం అనే కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాన్న మోహన్ బాబు గురించి సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read: Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?
మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో జరుగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఎమోషనల్ అయ్యారు. మనోజ్ మాట్లాడుతూ.. “ దేవుడు వచ్చి వరం ఇస్తానంటే .. మళ్లీ మేము అందరం కలిసే రోజూ రావాలని కోరుకుంటాను. అవకాశం వస్తే వెళ్లి నాన్న కాళ్ళు పట్టుకుని, నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. అలా అని నేను చేయని తప్పుని ఒప్పుకోను. ఇప్పుడు ఒప్పుకుంటే.. నా పిల్లలకు నేనేం నేర్పిస్తా.. మా నాన్న నేర్పించిన నీతినే నేను పాటిస్తున్నాను. అందుకే ఆగిపోతున్నాను. మళ్లీ మేమంతా కలిసి ఒకే చోట భోజనం చేయాలని ఉంది. సమస్యలు సృష్టించిన వారే తప్పును తెలుసుకుంటారని ” అని అన్నారు మనోజ్.