Manchu Manoj: కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి వివాదాలు నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రతీది పబ్లిగ్గానే వాళ్ల ఇంట్లో జరుగుతుంది. మీడియాను పిలిచి మరి కొట్టుకుంటున్నారు. ఇటీవల మోహన్ బాబు తన కుమారుల మధ్య జరుగుతున్న గొడవలతో ఫ్రస్ట్రేషన్‌కు లోనై మీడియాపై దాడి కూడా చేశారు. తెలంగాణలోనే కాదు, రీసెంట్‌గా రాయలసీమలో కూడా వీరి గొడవలు పాకానికి చేరుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ తొక్కి పడుతుండటంతో కాస్త ఆగాయి. కానీ, మళ్లీ వారి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి.
Also Read- Chiranjeevi: మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
రెండు, మూడు రోజులుగా మంచు మనోజ్ తనకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ మీడియా ముందుకు వస్తున్నారు. అంతేకాదు, అతని అన్న మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ట్విట్టర్ ఎక్స్ వేదికగా ‘దొంగప్ప’ అంటూ హేళన చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో మరోసారి వారి ఫ్యామిలీలో వివాదం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. మోహన్ బాబుని ఏం అనడం లేదు కానీ, అంతా తన అన్న మంచు విష్ణునే చేస్తున్నాడని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. వారి మధ్య వివాదానికి కారణం ఆస్తులు కాదని చెబుతున్నప్పటికీ, అదే ప్రధాన కారణమనేది వారి చేష్టలను చూస్తుంటే తెలిసిపోతుంది. ఇక మంచు మనోజ్ చేసిన తాజా ట్వీట్‌లో..

‘‘మీ క్యాలెండర్లలో డేట్‌ని మార్క్ చేసి పెట్టుకోండి! ‘ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప’ జూన్ 27న బిగ్ స్క్రీన్స్ మీదకు వస్తోంది. ఇంతకీ సినిమా విడుదల జూలై 17న, లేదంటే జూన్ 27నా?. 100 కోట్లకు పైగా (80శాతం #ViSmith కమిషన్) బడ్జెట్ సినిమా పీఆర్ ప్లానింగ్ కేక’’ అని ‘కన్నప్ప’ సినిమాను ఎగతాళి చేస్తూ మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు, విష్ణు పేరుని మార్చి రాసి, డబ్బు దొంగలించుకొని పారిపోతున్నట్లుగా అర్థం వచ్చే విధంగా ఓ ఇమేజ్‌ని కూడా జోడించాడు. మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓరి బాబు, ఇకనైనా ఆపండిరా అని ఒకరు, మీ పంచాయితీకి ముగింపు లేదా? అని మరొకరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే, ‘యో మనోజ్ అన్న తమ్ముడు ఏంది సామి ఇది. ఎంత చీ అనుకున్న విష్ణు పెద్దోడు.. మీ అన్న కదా ఎందుకు రోడ్డున పడటం. చిన్నప్పుడు మద్రాస్‌లో ఇంట్లో కొట్టుకున్నట్టు పెద్దయ్యాక ఇలా రోడ్డున పడితే ఎట్టా సామి.. పెద్దాయన పెదరాయుడు గుండెల మీద తంతున్నారు మీరు’ అంటూ చేసిన కామెంట్‌కు లైక్ మీద లైకులు పడుతున్నాయి.
Also Read- Pawan Kalyan Son: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ చెబుతూ.. ఎన్టీఆర్‌కు పవన్ కళ్యాణ్ రిప్లై!
‘కన్నప్ప’ విషయానికి వస్తే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు