Pawan Kalyan Thanks Jr NTR
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan Son: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ చెబుతూ.. ఎన్టీఆర్‌కు పవన్ కళ్యాణ్ రిప్లై!

Pawan Kalyan Son: సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డానని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బుధవారం తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ధైర్యంగా ఉండు లిటిల్‌ వారియర్. పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన కుటుంబసభ్యులంతా ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ప్రస్తుతం మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ (Mark Shankar Health Update) ఇస్తూ పవన్ కళ్యాణ్ తరపు నుంచి రిప్లై వచ్చింది. ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు, మార్క్ శంకర్ క్షేమం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన అందరికీ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ (Jana Sena Party) ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Mark Shankar: ఆస్పత్రిలో పవన్ తనయుడు.. ఫొటో చూస్తే గుండె తరుక్కుపోతుంది

తారక్ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘‘మీ దయ గల మాటలకు ధన్యవాదాలు తారక్ (Jr NTR). ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతును నిజంగా అభినందిస్తున్నాను. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు’’ అని పోస్ట్ చేశారు. తారక్‌కు మాత్రమే కాకుండా.. సుధీర్ బాబు, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్, రోహిత్ నారా, నిర్మాత ఎస్‌కెఎన్, అనన్య నాగళ్ల, పంచకర్ల రమేష్ బాబు, ఆదిరెడ్డి శ్రీనివాస్, పిఠాపురం వర్మ, బొమ్మిడి నాయకర్, విష్ణు వర్ధన్ రెడ్డి, బత్తుల బలరామకృష్ణ వంటి వారందరికీ సమాధానమిస్తూ.. ‘నా కుమారుడు కోలుకోవాలని ప్రార్థించిన మీకు ధన్యవాదములు. మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి దయతో మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు’ అని తెలిపారు. ప్రస్తుత జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ రిప్లై ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్, అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో (Singapore Fire Incident) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలయ్యారు. చిన్నారి మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లుగా బుధవారం ఒక ఫొటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ ఫొటో చూసిన వారంతా గుండె తరుక్కుపోతుందంటూ.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా కామెంట్స్ చేశారు.

Also Read- Pawan Kalyan son: పవన్ వద్దకు అడవి తల్లి.. వీడియో వైరల్..

అందరి ప్రార్థనలు ఫలించి, ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని డాక్టర్లు తెలిపినట్లుగా సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ అప్డేట్ ఇచ్చారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్క్ శంకర్‌‌ని గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్‌కు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది