Manchu Manoj
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: మెగా ఫ్యాన్స్‌కు నేను సారీ చెబుతున్నాను..

Manchu Manoj: మంచు మనోజ్ ఒక్కసారిగా అందరి అటెన్షన్‌ని పొందుతున్నారు. రీసెంట్‌గా తన అన్న మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అంటూ అందరికీ షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు మెగాభిమానులను క్షమాపణలు కోరాడు. అదేంటి? మెగా ఫ్యాన్స్‌కి మంచు మనోజ్ సారీ చెప్పడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే విషయం తెలుసుకోవాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’ (Bhairavam Movie). విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ స్థాయిలో ఈ మల్టీ హీరోల చిత్రాన్ని నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. మే 30న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Natti Kumar: పవన్ కళ్యాణ్ సినిమాపై పేర్ని నాని కుట్ర.. కేసు పెట్టాల్సిందే!

ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘భైరవం’ సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. రోహిత్, నేను, సాయి సొంత బ్రదర్స్‌లాగే ఉన్నాం. ఈ సినిమాతో మా బంధం మరింత పెరిగిందని చెప్పగలను. కలకాలం ఇది ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అతిథి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఆనందితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. మా టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఒకే కులం వాళ్లు కలిసి చేసిన సినిమా ఇదనే మాటలు విన్నాను. సినిమా అనేది కులం చూడదు. మా కులం సినిమా. మా గుడి సినిమా థియేటర్. ఇక్కడ ప్రతిభ ఉన్నవాళ్లే పైకి వస్తారు. ప్రతిభ ఉన్న వాళ్ళకి కాస్త ఆలస్యమైనా సరే.. అవకాశాలు తప్పకుండా వస్తాయి. మా నిర్మాత రాధా మోహన్ కూడా మేము సక్సెస్‌లో ఉన్నామా? సినిమాలు చేస్తున్నామా? అనే లెక్కలేసుకోకుండా కేవలం మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశారు.

Also Read- Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు

సినిమా మా తల్లి. ఆ తల్లి అందరినీ సమానంగానే చూస్తుంది, చూసుకుంటుంది. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేషన్‌తో సినిమాలు చేసే వ్యక్తి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కారణంగా ఆయనపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. అది నా దృష్టికి కూడా వచ్చింది. విజయ్ మెగా అభిమాని. నిజంగా ఆయన పోస్ట్ పెట్టారో, పెట్టలేదో నాకు తెలియదు కానీ, ఆ పోస్ట్ మీ అందరికీ ఇబ్బంది కలిగించినందుకు మా టీమ్ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని మేమందరం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ థియేటర్లకు వచ్చి, ఈ సినిమా చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన అభిమానసోదరులందరికీ కృతజ్ఞతలు. ‘భైరవం’ 30వ తారీఖున థియేటర్లలోకి వస్తుంది. దుమ్ము రేపేద్దామని అన్నారు. అది మ్యాటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం