manchu-lakshmi( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: వారిని ఏకిపారేస్తున్న మంచు లక్ష్మి.. ఎందుకంటే?

Manchu Lakshmi: మంచు లక్ష్మి తన కుటుంబంపై కొంతమంది చేసిన కుట్రలపై ఆమె మండిపడ్డారు. మంచు ఫ్యామిలీలో 2024 చివరి నుంచి మోహన్‌బాబు, మనోజ్, విష్ణు మధ్య కుటుంబ వివాదాలు జరిగాయి. ఈ వివాదాలు మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ మధ్యలో 2025 సెప్టెంబర్‌లో విడుదలైన ‘మిరాయ్’ సినిమా మనోజ్‌కు సూపర్‌హిట్‌గా మారి, అతని కెరీర్‌లో కొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా సక్సెస్ మీట్, ప్రమోషన్ల సందర్భంగా మంచు లక్ష్మి వ్యాఖ్యలు చేసినప్పుడు కొన్ని మీడియా రిపోర్టులు ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకుని, ట్విస్ట్ చేసి ప్రచురించాయని ఆమె ఆ మాడియా సంస్థలపై మండి పడ్డారు. వారిపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై శాపనార్థాలతో ఫైర్ అయ్యారు. వారు కూడా కర్మను తప్పించుకోలేరని అన్నారు.

Read also-Katrina Kaif: వైరల్ అవుతున్న కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫోటోలు.. మండిపడుతున్న ఫ్యాన్స్..

‘మిరాయ్’ సినిమా (దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని) సెప్టెంబర్ 12, 2025న విడుదలైంది. తేజ సజ్జా, రితికా నాయక్ హీరో-హీరోయిన్‌లు, మనోజ్ విలన్ పాత్రలో నటించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సక్సెస్ మీట్ (సెప్టెంబర్ 13, 2025)లో మనోజ్ భావోద్వేగానికి గురై, తన కష్టాలు, ఫ్యామిలీ సపోర్ట్ గురించి మాట్లాడాడు. అతను “ఈ సినిమా చేయడానికి చాలామంది డిస్కరేజ్ చేశారు, కానీ ప్రొడ్యూసర్ విశ్వాసం పెట్టాడు” అని చెప్పాడు. ఈ ఈవెంట్‌లో లక్ష్మి పాల్గొనలేదు, కానీ తర్వాత ఆమె వీడియో రివ్యూ ఇచ్చింది.

Read also-Bigg Boss Telugu 9: భరణి గారి కుటుంబం.. అని పెట్టి ముద్ద మందారం సీజన్ 2 తీయండి? బిగ్ బాస్ పై నెటిజన్స్ ఫైర్

సెప్టెంబర్ 12న ‘మిరాయ్’ చూసిన తర్వాత లక్ష్మి ఒక వీడియో రివ్యూ రిలీజ్ చేసింది. ఆమె మనోజ్‌ను “బుజ్జీ” (తమ్ముడు) అని పిలిచి, “నువ్వు ఇన్‌క్రెడిబుల్ గా ఉన్నావు రా బేబీ! గాడ్ బ్లెస్ యూ. నువ్వు నీళ్లలా అయిపోతావు, ఏ రోల్ చేస్తే అందులో ఇమిడిపోతావు. ఈ పాత్ర చేసినందుకు నీ గురించి గర్వపడాలి. నిన్ను దింపడానికి రాముడే దిగిరావాలి” అని భావోద్వేగంతో పొగిడింది. సినిమా మొత్తం “అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్” అని మెచ్చుకుంది. ఈ వీడియో వైరల్ అయింది. తన కుటుండం జోలికి వచ్చిన వారు నాశనం అయిపోతారని, వారికి పుట్టగతులు ఉండవని ఫైర్ అయ్యారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన దీక్ష సినిమా థియేట్రికల్ గా యావరేజ్ అనిపించినా.. ఓటీటీలో మంచి విజయం సాధించింది.

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు