Jagannath: ‘జగన్నాథ్’కు మంచు హీరో సపోర్ట్.. అనగానే ఏ ‘జగన్నాథ్’కి అని అనుకుంటున్నారు కదా. మీరనుకుంటున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే కాదు. ఎందుకంటే, ప్రస్తుతం పూరి జగన్నాథ్ పరిస్థితి అలా ఉంది కాబట్టి.. జగన్నాథ్ అనగానే ఆయనే మైండ్‌లోకి వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ‘జగన్నాథ్’ సినిమా పేరు. ఈ సినిమాకు మంచు హీరో మంచు మనోజ్ సపోర్ట్ అందించారు. రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన ఈ చిత్ర టీజర్‌ని రాక్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ హాజరై టీజర్ విడుదల చేశారు.
Also Read- Manchu Manoj: ఇది ఆస్తి గొడవ కాదు.. ఎమ్మెల్యేకి మంచు మనోజ్ రిక్వెస్ట్
టీజర్ విడుదల అనంతరం మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ.. ‘జగన్నాథ్’ మూవీ టీజర్ విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. టీజర్ చాలా బాగుంది. తమ్ముడు ‘రాయలసీమ’ భరత్ చేసిన ఫస్ట్ మూవీ ఇదని తెలిసి ఆశ్చర్యపోయాను. అంత ప్రొఫెషనల్‌గా ఇందులో నటించాడు. టీజర్ చూస్తుంటే చిత్రయూనిట్ కష్టం కనిపిస్తోంది. భరత్ ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ కాదు.. కానీ స్నేహితులందరూ ప్యాషన్‌తో అది సాధ్యం చేశారు. రూ. 1 కోటితో తీసిన సినిమా చిన్నది, రూ. 1000 కోట్లతో తీసిన సినిమా పెద్దది అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే, కంటెంట్ బాగుందా? బాగాలేదా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

తన సినిమా టీజర్ విడుదల చేసిన మనోజ్‌పై హీరో రాయలసీమ భరత్ పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘మంచు మనోజ్ అన్న మంచి మనసున్న వ్యక్తి. ఈ వేడుకకు ఆయన మంచి మనసుతో స్వచ్ఛందంగా వచ్చారు. నిజంగా గ్రేట్ పర్సన్. ఈ సపోర్ట్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. సినిమా, నటన మీద ఇష్టంతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 5 సంవత్సరాల శ్రమతో ‘జగన్నాథ్’ మూవీని పూర్తి చేశాం. నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ హీరో భరత్ చెప్పుకొచ్చారు. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై భరత్ – సంతోష్ దర్శకత్వంలో.. పీలం పురుషోత్తం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: