Manchu Family Emotional: గత కొద్దీ రోజుల నుంచి మంచు కుటుంబంలో వివాదాలు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘కన్నప్ప’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త, ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్స్’లో ఉత్తమ బాల నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సంతోషకర వార్తను విష్ణు తన X ఖాతాలో పంచుకోగా, దీనిపై మనోజ్ స్పందించాడు.
“కంగ్రాట్స్ అవ్రామ్! నిన్ను ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జీవితంలో ఎదిగి రాణించాలి నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్ బాబు గారితో కలిసి నీవు అవార్డు అందుకోవడం చూస్తే నిజంగా సంతోషంగా ఉంది. ప్రేమతో, నీ బాబాయి,” అంటూ మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
Also Read: Poll Body Boss: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బిగ్ షాక్.. అభిశంసన దిశగా విపక్షాల అడుగులు!
విష్ణు-మనోజ్ మధ్య గత కొంతకాలం నుంచి విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో, మనోజ్ ‘అన్నా’ అని పిలవడంతో నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. దీంతో అభిమానులు, ” వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా?” అని చర్చించుకుంటున్నారు. అవ్రామ్ భక్త తన మొదటి సినిమాతోనే అవార్డు సాధించడంపై విష్ణు ఆనందం వ్యక్తం చేశాడు. అవార్డు వేదికపై మాట్లాడుతూ, “ఇదంతా ఆ పరమేశ్వరుడి దయ. అవ్రామ్‌కు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నాడు.
Also Read: Swetcha Special story: కోట్ల విలువ చేసే భూములు హాం ఫట్.. విచ్చల విడిగా అనుమతులిచ్చిన అధికారులు!
అవ్రామ్ కూడా తన సంతోషాన్ని పంచుకుంటూ, ” ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు” అని తెలిపాడు. చెప్పాడు. ఈ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ రూపొందించిన ‘కన్నప్ప’లో విష్ణు శివభక్తుడిగా నటించి, తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన అందించాడు. కమర్షియల్‌గా నిరాశపరిచినప్పటికీ, కథ, నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో విష్ణు ముగ్గురు పిల్లలు.. అవ్రామ్ భక్త, అరియనా, వివియనా వెండితెరకు పరిచయమయ్యారు. అవ్రామ్, విష్ణు చిన్నప్పటి ‘తిన్నడు’ పాత్రలో అద్భుతంగా నటించగా, అరియనా, వివియనా ‘శ్రీకాళహస్తి’ పాటలో అలరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు