Mana Shankara Varaprasad Garu: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి అసలైన మాస్ జాతర మొదలుకాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తూ, చిత్ర యూనిట్ సినిమాలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది ముగింపును, కొత్త ఏడాది ఆరంభాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి మేకర్స్ పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 30న ఈ ‘బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్’ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను శనివారం విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
Also Read- Anasuya Viral Post: మిస్ అవుతున్నా.. స్విమ్ సూట్ వీడియో పెట్టి మరీ ట్రోలర్స్‌కు షాకిచ్చిన అనసూయ
పోస్టర్ అదిరింది
న్యూ ఇయర్ పార్టీల్లో ఈ పాట మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పాట అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి డెనిమ్ లుక్, స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో తనదైన మెగా స్వాగ్‌తో అదరగొట్టారు. చిరు గ్రేస్ మళ్ళీ వింటేజ్ రోజులను గుర్తుచేస్తోంది. విక్టరీ వెంకటేష్ రెడ్ జాకెట్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా, స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు పక్కపక్కన మాస్ డాన్స్ పోజులో ఉండటం ఫ్యాన్స్‌కు కనువిందుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వందలాది డ్యాన్సర్ల మధ్య కలర్ ఫుల్ వైబ్స్‌తో ఈ పాట అత్యంత భారీ వ్యయంతో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
Also Read- Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!
సంక్రాంతి బరిలో..
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగాస్టార్ మాస్ పల్స్, వెంకటేష్ క్లాస్ అండ్ కామెడీ టైమింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శనివారం రాబోయే ప్రోమో కోసం ఇరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌ని కూడా దర్శకుడు అనిల్ రావిపూడి మొదలు పెట్టారు. టీవీ ప్రోగ్రామ్స్‌లో ఆయన సినిమాను ప్రమోట్ చేస్తున్నట్లుగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్స్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి వచ్చిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలవడంతో ఈ పాటపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ పాట అందుకుంటుందో, లేదో తెలియాలంలే డిసెంబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

