Mahesh Babu: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యమైన దంపతుల్లో మహేష్ బాబు, నమ్రత ఒకరు. వీరి పెళ్లి జరిగి ఎన్నో ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. అలాగే, మహేష్ బాబు తన భార్య నమ్రతతో తప్ప ఏ హీరోయిన్‌తో ఎక్కువ మాట్లాడింది లేదు. ఇక్కడే తెలిసిపోతుంది భార్య అంటే ఎంత ప్రేమో. సినిమా ఈవెంట్స్‌లో కూడా హీరోయిన్స్‌ను గౌరవించి మాట్లాడతాడు మహేష్.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
సినిమాలు షూటింగ్, తన ఫ్యామిలీ తప్ప మహేష్ బాబుకి వేరే లోకం ఉండదు. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మహేష్ బాబు, నమ్రత మధ్య గొడవలు జరిగాయని, ఇద్దరూ దూరంగా ఉంటున్నారనే వార్త గతంలో తెగ వైరల్ అయింది. అదే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇంతకీ, అసలేం జరిగిందో తెలుసుకుందాం.
Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?
కొడుకు గౌతమ్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత మహేష్, నమ్రత మధ్య విపరీతమైన గొడవలు అయ్యాయట. అదే టైమ్‌లో నమ్రత తల్లిదండ్రులను కూడా కోల్పోవడంతో ఈ గొడవలు ఇంకా బాగా పెరిగిపోయాయి. దీంతో, మహేష్ బాబుకు దూరంగా ఉండాలని గౌతమ్‌ను తీసుకొని ముంబై వెళ్ళిపోయిందట. అలా కొన్ని నెలల పాటు వీరిద్దరూ కలిసింది, మాట్లాడింది కూడా లేదట.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
అయితే, ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారట. కొన్నాళ్లకు నమ్రత మనసు మార్చుకుని, మహేష్ బాబు దగ్గరకు తిరిగి వచ్చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇక అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి గొడవలు రాలేదని, ఆ తర్వాత సితార పుట్టిందని, నమ్రత కూడా దీని గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పిందనే న్యూస్ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే, మహేష్, నమ్రత జంట సినీ ఇండస్ట్రీలో “మేడ్ ఫర్ ఈచ్ అదర్”లా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.