Narasimha Oscars: ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ'..
MAHAVATAR-NARASIMHA( IMAGE :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Narasimha Oscars: అకాడమీ అవార్డ్స్ బరిలో ‘మహావతార్ నరసింహ’.. భారతీయుల కల నెరవేరనుందా?..

Narasimha Oscars: భారతీయ సినీ చరిత్రలో ఓ అరుదైన, చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. పురాణ ఇతివృత్తంతో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’, 2026లో జరగబోయే 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) లో ‘ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడటానికి అర్హత సాధించింది. ఈ అపూర్వమైన విజయం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు ప్రపంచ వేదికపై దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.

Read also-Mandhana Wedding: స్మృతి మంధాన కుటుంబ గోప్యతను గౌరవించాల్సినదిగా మీడియాను కోరిన పలక్ ముచ్చల్..

బాక్సాఫీస్ సంచలనం..

హోంబాలే ఫిల్మ్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం, విడుదలైన నాటి నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణ గాథలైన నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం ఆధారంగా దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి, దేశంలో యానిమేటెడ్ సినిమాల మార్కెట్‌కు ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు ఈ విజయం ఆస్కార్ బరిలోకి అడుగుపెట్టడం, సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

గ్లోబల్ చిత్రాలతో పోటీ..

‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 యానిమేటెడ్ చిత్రాలతో పోటీ పడుతోంది. ఇందులో ‘జూటోపియా 2’ (Zootopia 2), ‘డెమోన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ కాజిల్’ (Demon Slayer: Kimetsu no Yaiba – Infinity Castle) వంటి పెద్ద అంతర్జాతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. ఒక భారతీయ యానిమేషన్ చిత్రం ఈ అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీ పడటానికి అర్హత సాధించడం నిజంగా గర్వించదగిన విషయం.

Read also-Bigg Boss9: బిగ్ బాస్ రణరంగం చివరి అంకానికి చేరుకుంది.. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ మామూలుగా లేదుగా..

భారత్‌కు తొలి యానిమేటెడ్ ఆస్కార్?

ఒకవేళ ‘మహావతార్ నరసింహ’ తుది నామినేషన్స్ జాబితాలోకి ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన మొట్టమొదటి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. దేశీయంగా తయారైన ఒక పురాణ గాథ ప్రపంచ అత్యున్నత సినీ పురస్కారం కోసం పోటీ పడటం, భారతదేశం సాంస్కృతిక వారసత్వం, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం. ఆస్కార్ నామినేషన్ల తుది జాబితాను 2026, జనవరి 22న ప్రకటించనున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15, 2026న జరగనుంది. ఆ రోజు భారతీయ యానిమేషన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిలో నెలకొంది.

Just In

01

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి