Maargan: విజయ్ ఆంటోని (Vijay Antony) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మార్గన్’ (Maargan Movie). లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె. రామాంజనేయులు సమర్పిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ నిమిత్తం ‘మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్’ అనే ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.
Also Read- Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?
ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ బాబు (Producer Suresh Babu) మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. నేను ఇలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను. అందుకే నేను ‘మార్గన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వేల్యూ, మేకింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టమని అన్నారు.
Also Read- Virgin Boys: రామ్ గోపాల్ వర్మ రియల్ వర్జిన్.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. మా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబుకు ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా అస్సలు ఉండదు. ఇందులో తెలియకుండానే చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. ‘భద్రకాళి, లాయర్’ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను. ‘మార్గన్’ చిత్రాన్ని ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ ‘బిచ్చగాడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తుంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం సినిమా సక్సెస్ కావాలని కోరారు.
విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి ఈ చిత్రంలోని తారాగణం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు