Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. మహేష్ బాబు సుకుమార్ కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తూ హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు విహార యాత్రలో మునిగితేలుతోంది. వెకెషన్స్ లో గడుపుతూ షూటింగ్ విరామాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. తన విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను తాజాగా కృతి నెట్టింట పంచుకోగా.. అవి వైరల్ గా మారాయి.
ఫొటోల్లో ఏముందంటే?
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోల్లో.. ఆమె నడి సంద్రంలో ఎంతో ఆనందంగా గడిపినట్లు కనిపిస్తోంది. ఈ బ్యూటీ బోట్ రైడ్ ను తెగ ఎంజాయ్ చేసినట్లు ఫొటోలను బట్టి అర్థమవుతోంది. అంతేకాదు సముద్రపు అందాలు సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోల్లో రంగు రంగుల బ్రాలెట్ డ్రెస్ ధరించిన ఆమె.. తడిచిన జుట్టును ఒక పక్కనకు లాగి చాలా అందంగా కనిపించారు. మరికొన్ని చిత్రాల్లో లగ్జరీ క్రూయిజ్ షిప్ డెక్ ను.. అందులో సీటింగ్ ఏర్పాట్లు, ఇతర సామాగ్రి, నీలి ఆకాశం పంచుకున్నారు. అలాగే ఆమె ఎగ్స్ బెనెడిక్ట్ వంటి రుచికరమైన వంటకాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించారు.
బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిందా?
తన లేటెస్ట్ పోస్ట్ కు కృతి.. ఆసక్తికర క్యాప్షన్ సైతం పెట్టింది. ‘సాల్టి హెయిర్.. రెయిన్ బో ఆన్ మై హార్ట్.. ఫ్లోయింగ్ విత్ ది వేవ్.. సన్ సెట్స్ ఇన్ ఏ పోస్ట్ కార్డ్’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తన విహారయాత్రలో చాలా ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉన్నట్లు లెటేస్ట్ ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియాతో ఈ క్రూయిజ్ షిప్ లో వెకెషన్ కు వెళ్లారన్న ప్రచారం కూడా బాలీవుడ్ లో జరుగుతోంది. వారిద్దరి ఇన్ స్టాగ్రామ్ పోస్టులలో ఒకే విధమైన లొకేషన్స్ ఉండటం.. ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
Also Read: Samantha: సమంత రెండో పెళ్లికి డేట్ ఫిక్స్.. అదే రోజున చైతూకి బిగ్ షాక్ ఇవ్వనున్న సామ్?
కృతి.. మూవీ ప్రాజెక్ట్స్
ఇక కృతి సనన్.. సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవలే ‘తేరే ఇష్క్ మే’ అనే చిత్రాన్ని కంప్లీట్ చేశారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘కాక్ టెయిల్ 2’ సినిమా షూటింగ్ ఆమె త్వరలోనే పాల్గొననున్నారు. ఇటీవల ఆమె ‘దో పట్టి’చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. ఇది నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. కృతి తెలుగులో వన్ నేనొక్కడినే సినిమాతో పాటు నాగ చైతన్య నటించిన దోచెయ్ చిత్రంలోనూ నటించింది. ఈ సినిమా హాస్య ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.