K Ramp Team
ఎంటర్‌టైన్మెంట్

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

K-Ramp: సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌‌పై రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మాకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. శనివారం (సెప్టెంబర్ 27) ఈ సినిమా ర్యాంప్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

Also Read- Cow Rescue: భారత పర్యటనలో ఉన్న ఈ ఆస్ట్రేలియా టూరిస్ట్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనేమో!

‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ.. కిరణ్ అన్న చేసిన ‘మీటర్’ మూవీ టైమ్‌లో నేను ఈ కథ చెప్పాను. ‘క’ మూవీ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ సినిమా ఫుల్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. నువ్వు ఎంత స్క్రిప్ట్‌లో రాస్తే.. అంత పెర్ఫార్మ్ చేస్తా అని కిరణ్ అన్న ఎంకరేజ్ చేసేవారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమా బాగా రావాలని చెబుతూ.. నేను సినిమా కోసం ఏది కావాలన్నా మా ప్రొడ్యూసర్స్ రాజేష్, శివ ఇచ్చారు. వారికి థ్యాంక్స్. నరేష్ సార్‌కి క్యారెక్టర్ చెప్పేందుకు వెళ్లినప్పుడు చాలా భయపడ్డాను. ఆయన స్క్రిప్ట్ విని తప్పకుండా చేస్తానని అనగానే చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా టైటిల్ ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు. కె ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని అర్థం. అది దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను, సినిమా రూపొందించాను. థియేటర్స్‌లో కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ చూస్తారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కుమార్. ఆయన గురించి, పాత్ర గురించి తర్వాత మరింత డీటెయిల్‌గా చెబుతానని తెలిపారు.

Also Read- Mohan Babu: కింగ్ నాగార్జున రూటులోనే కలెక్షన్ కింగ్.. మరో పిక్ వచ్చింది చూశారా?

ఇండస్ట్రీకి మరో త్రివిక్రమ్, హరీశ్ శంకర్

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ‘కె-ర్యాంప్’ కథను నా దగ్గరకు కిరణ్ పంపించారు. కథ విన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. మా సంస్థలో మరో ఎంటర్‌టైనర్ అని ఫిక్సయ్యాను. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు పంపిన కిరణ్ అబ్బవరానికి థ్యాంక్స్. ఈ మూవీ చేస్తున్నప్పుడు నరేష్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. జైన్స్ నానితో ఇండస్ట్రీకి మరో త్రివిక్రమ్, హరీశ్ శంకర్ దొరికాడని అనుకుంటున్నాను. డైలాగ్స్ అంత బాగా రాశారు. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఈ మూవీ కోసం డెడికేటెడ్‌గా వర్క్ చేసి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా సంస్థలో రాబోయే మూడు చిత్రాలకు చేతన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటాడు. హీరోయిన్ యుక్తి తన నటనతో చింపేసింది. నరేష్ మాకు ఒక ఫాదర్‌లా సపోర్ట్ చేశారు. ఒక బ్రదర్‌తో సినిమా చేసినంత హ్యాపీగా కిరణ్‌తో మూవీ చేశా. ఆయనతో మళ్లీ మళ్లీ మూవీస్ చేయాలని అనుకుంటున్నాను. ఈ దీపావళికి పోటీ ఎంత ఉన్నా.. మా మూవీ సక్సెస్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నామని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి