KOTA SRINUVASARAO (IMAGE SOURCE :x)
ఎంటర్‌టైన్మెంట్

Kota Srinivas Rao: ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

Kota Srinivas Rao: తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. సినీ రంగం నుంచి ప్రముఖులు, అభిమానులు మహా ప్రస్థానం వరకూ జరిగిన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆయన మనవడు శ్రీనివాస్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు మృతికి పలువురు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు కోట పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతికి సంతాపం తెలిపారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోట మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కోట విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడని కేసీఆర్ అన్నారు.

Also Read – Tinmar Mallanna: జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్

కోట శ్రీనివాసరావుకు నటనపై ఉన్న ఆసక్తితో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రంగస్థల నాటకాలు వేసేవారు. కోట ఆసక్తిని గమనించిన దర్శక నిర్మాత క్రాంతికుమార్‌ వెండి తెరపై మొదటి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కోట విభిన్న పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ ఇలా టాలీవుడ్‌ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ‘ప్రతి ఘటన’, ‘ఆహనా పెళ్ళంట!’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘ఆమె’ ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కోట చెప్పారు.

Also Read – Nandamuri Balakrishna: ‘బాలకృష్ణ కాండ్రించి ఉమ్మేశాడు’… కోట శ్రీనివాసరావు

తెలుగు సినిమా చరిత్రలో నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆయన చేసిన విలన్ పాత్రలు విలనిజానికి కొత్త భాష్యం నేర్పేవిగా ఉన్నాయి. విలన్‌గా, కామెడియన్‌గా, కామెడీ విలన్‌గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిస్వాశ విడిచిన విషయం తెలిసిందే. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కెరీర్ మొదట్లో కోట శ్రీనివాసరావు స్టేట్‌ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేసేవారు. 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’తో సినిమాల్లోకి ఆరంగ్రేటం చేశారు. తర్వాత రోజుల్లో తెలుగుతో పాటు హీందీ తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. సుమారు 750 కుపైగా చిత్రాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల పాటు నడిచిన నటనా జీవితంలో ఆయన తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు. 1999 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన సినిమాలకు అందించిన సేవలకు గాను 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!