Kishkindhapuri Trailer: తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే భైరవం సినిమాతో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, తాజాగా మరో కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ తెరకెక్కిన చిత్రం ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్ళపాటి డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే నేడు ‘కిష్కింధపురి’ ట్రైలర్ విడుదలైంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి చాలా కష్ట పడి ఈ చిత్రాన్ని రూపొందించారు. సాహు గారపాటి నిర్మాతగా బాధ్యత తీసుకున్నారు. ట్రైలర్‌లో హారర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, విజువల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అంతే కాదు, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అవుతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అనుపమ పరమేశ్వరన్ దెయ్యం గెటప్‌లో కనిపించడం ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాక్షసుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరి, ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుందో? లేదో చూడాల్సి ఉంది.