kiran-abbavaram( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Kiran Abbavaram: ఆ హిట్ సినిమాకు తమిళనాడులో థియేటర్లు లేవన్నారు.. వారికి ఇక్కడ దొరుకుతాయి..

Kiran Abbavaram: తెలుగు సినిమా పరిశ్రమలో తన ఇమేజ్‌ ఏర్పాటు చేసుకున్న నటుల్లో కిరణ్ అబ్బవరారిని ప్రత్యేక స్థానం ఉంటుంది. తన తాజా చిత్రం ‘కె-రాంప్’ తో మరోసారి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మునుపటి చిత్రం ‘కేఎ’ తమిళనాడులో విడుదల కాకపోవడంపై జరిగిన రాజకీయం గురించి చెప్పుకొచ్చారు. తమిళ ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాలకు సమాన ప్రోత్సాహం లభించడం లేదని, ఇది ఒక రకమైన వివక్ష అని ఆరోపించాడు. కిరణ్ అబ్బవరం మాటల్లో, “తెలుగు ప్రేక్షకులు ఇతర భాషా చిత్రాలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కానీ, మేము తమిళ్లో అంతే ప్రేమను పొందడం జరుగుతుందా? ‘కె-రాంప్’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రదీప్ రంగనాథన్ తన డ్యూడ్ చిత్రానికి తెలుగులో స్క్రీన్లు పొందుతున్నట్టుగా, నా సినిమాకు కూడా తమిళ విడుదల ఉండాలని ఆశిస్తున్నాను. కానీ, స్క్రీన్లు దొరకవు అని నాకు తెలుసు.” అని చెప్పాడు. ఈ మాటలు తెలుగు-తమిళ సినిమా పరిశ్రమల మధ్య ఉన్న అసమానతలను హైలైట్ చేస్తున్నాయి.

Read also-Jubilee Hills By-Election: ఎన్నికల కోడ్‌ జూబ్లీహిల్స్‌ వరకే.. అక్టోబర్ ఈ తేది నుంచి నామినేషన్లు స్వీకరణ

మరిన్ని వివరాల్లో కిరణ్ మాట్లాడుతూ, “కారణం ఏమిటో నాకు తెలియదు. కేఎ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఇతర హీరోలకు స్క్రీన్లు లేవని బహిరంగంగా అక్కడి వారు చెప్పారు. తమళ హీరోలను తెలుగులో పద మందికి ఇక్కడ మంచి మార్కెట్ ఉంటది కానీ ఇక్కడి, హీరోలకు ఎంతమందికి తమిళంలో మార్కెట్ ఉంది. ” అని ప్రశ్నించారు. ‘కేఎ’ చిత్రం 2023లో విడుదలై, తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో కిరణ్ డైరెక్టర్‌గా, హీరోగా, నిర్మాతగా కూడా చేశారు. కానీ, తమిళనాడు మార్కెట్‌లో ఆ సినిమాకు చోటు దొరకడం లేదు. ఇక ‘కె-రాంప్’ చిత్రం యాక్షన్, కామెడీ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Reada also-Haritha Harish Wife: పవన్ కళ్యాణ్‌కే తప్పలేదు.. మా వారు ఎంత?

ప్రస్తుతం కిరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీశాయి. కొందరు కిరణ్‌తో పూర్తిగా ఏకీభవిస్తూ.. తమిళ ఇండస్ట్రీలో బిగ్ హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని వాదిస్తున్నారు. “తెలుగు సినిమాలు తమిళ్లో విడుదల కావాలి, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు” అంటూ ట్రెండింగ్ హ్యాష్‌ ట్యాగ్‌లు సృష్టించారు. మరో వైపు, కొందరు ఇది మార్కెట్ డైనమిక్స్‌కు సంబంధించినదని, బాక్సాఫీస్ పొటెన్షియల్ ఆధారంగా స్క్రీన్లు అలాట్ చేస్తారని వాదనలు చేస్తున్నారు. తమిళ సూపర్‌స్టార్లైన విజయ్, అజిత్ చిత్రాలు డామినేట్ చేస్తున్న సమయంలో, చిన్న చిత్రాలకు స్క్రీన్లు దొరకకపోవడం సహజమే అని వారు అంటున్నారు. ఈ ఘటన తెలుగు-తమిళ సినిమా ఇండస్ట్రీల మధ్య సహకారాన్ని పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. గతంలో పుష్ప, రామ్ చరణ్ చిత్రాలు తమిళలో సక్సెస్ అవ్వడం ద్వారా రెండు ఇండస్ట్రీల మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. కానీ, చిన్న హీరోల చిత్రాలు కూడా సమాన అవకాశాలు పొందాలని కిరణ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇది భవిష్యత్తులో ఇంటర్-స్టేట్ రిలీజ్‌లకు కొత్త చర్చలకు దారితీయవచ్చు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!