Haritha Harish Wife: పవన్ కళ్యాణ్‌కే తప్పలేదు.. మా వారు ఎంత?
Haritha Harish
ఎంటర్‌టైన్‌మెంట్

Haritha Harish Wife: పవన్ కళ్యాణ్‌కే తప్పలేదు.. మా వారు ఎంత?

Haritha Harish Wife: ‘నేనొకటి బాగా నమ్ముతాను. ఎథిక్స్, మోరల్స్ అనేవి ఇవాళ రేపు ఎవరు పాటిస్తున్నారో తెలియదు. కానీ ఎథిక్స్, మోరల్స్ ప్రిన్సిపుల్స్‌గా ఉండేవాళ్ళకు నెగిటివిటీ తప్పదు. అంతేందుకు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే తప్పలేదు.. మనమెంత’ అని అన్నారు బిగ్ బాస్ ఫేమ్ హరిత హరీష్ భార్య. గత వారం హౌస్ నుంచి ఎలిమినేటైన్ హరీత హరీష్.. హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి బాగా నెగిటివిటీని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మాటలు పరంగా కూడా ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతున్నాననుకుని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో.. ప్రేక్షకులు ఆయనని దూరం పెట్టేశారు. తద్వారా మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న హరీష్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఫాలోయింగ్ బాగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇక తన భర్త గురించి తాజాగా హరీష్ భార్య ఓ మీడియా ఛానల్‌తో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!

ఎమోషనల్ అండ్ జాయ్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్

‘‘బిగ్ బాస్‌కు వెళ్లే ముందు ఆయనే నన్ను మోటివేట్ చేశారు. ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. థాట్స్, జర్నీ ఎలా ఉంటుంది అనేది. కానీ కొన్ని అయితే తెలియక పోవచ్చు కానీ.. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ చూసేవాళ్ళు, షో ఫార్మాట్‌ని లైఫ్‌తో కంపేర్ చేసి చూశారు కాబట్టి చాలా క్లారిటీగా ఉన్నారు. నేను ఆయన్ని మోటివేట్ చేయడం కాదు.. నన్నే ఆయన మోటివేట్ చేసి వెళ్లారు. నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. అందుకని మా రిలేటివ్స్ కూడా నాకు కాల్ చేసేవాళ్ళు. నెగిటివిటీ వచ్చినా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి వెళ్లారు. ఇది చాలా ఎమోషనల్ అండ్ జాయ్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి.

Also Read- Bigg Boss Telugu 9: డే 31 ఎక్స్‌ప్లోజివ్ టాస్క్స్.. తనూజ, కళ్యాణ్ పడేశారు.. సుమన్ శెట్టి ఆర్ట్ పీక్స్!

ఆ సమాధానాలకి నేనే షాక్ అయ్యాను

ఆయన గురించి ఒక మూడు విషయాలు చెప్పాలంటే నేను కరెక్టుగా చెప్పలేకపోవచ్చు. కానీ ఒక సంఘటన గురించి షేర్ చేసుకుంటాను. అగ్ని పరీక్షకు ఆడిషన్ వీడియో పంపించామన్నారు. పంపించిన తరువాత అందులో సెలెక్ట్ అయ్యారు. తర్వాత జూమ్ కాల్ అని చెప్పారు. అందులో కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికీ నేనైతే ఆలోచించేదాన్ని. ఏం చెప్పాలి అని.. ఆ ప్రశ్న ఏంటంటే చనిపోయిన వాళ్ళల్లో మీ ఫేవరేట్ పర్సన్ ఎవరని అడిగారు. దానికి సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ అని చెప్పారు. ఆ తర్వాత వాటికి కూడా అస్సలు తడుముకోకుండా విత్ ఇన్ సెకండ్స్‌లో సమాధానం చెప్పారు. ఆయన గురించి తెలిసిన నేనే ఎంతో షాక్ అయ్యాను. అలాగే బతికున్న వాళ్ళల్లో ఎవరని అడిగితే పవన్ కళ్యాణ్ అని అన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలలో మిమ్మల్ని బాగా కలిచి వేసిన విషయం ఏంటి.. మీరు బాగా ఫీల్ అయిన విషయం ఏంటి అని అంటే.. రమ్య అనే పాప చనిపోయింది కదా.. ఒక త్రీ జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యారు దానికి. మాకు అప్పటికి ఆడిషన్ పూర్తయ్యి 20 టు 28 డేస్ అయ్యింది. మాకు ఇక కాల్ రాదనుకుని బయటికి వెళ్ళాం. అస్సలు దాని గురించి ఆలోచన ఉండదు కదా.. అటువంటి టైమ్‌లో ఒక పర్సన్‌కి ఇలాంటి ఆన్సర్స్ రావడం అనేది.. నేనైతే ఆలోచిస్తాను ఏం చెప్పాలి అని. కానీ ఆయన చెప్పిన సమాధానాలకి నేనే షాక్ అయ్యాను.

అప్పుడర్థమైంది ఆయన చాలా క్లారిటీగా, క్లియర్ గా ఉన్నారు అని నాకు అనిపించింది. మొత్తంగా అయితే హరీష్ ఫ్యాన్స్‌కి పెద్ద థాంక్స్ చెప్పాలి. చాలా చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయటికి వచ్చాక, ఆయన నిజాయితీని చూసి, ఆయన గేమ్ నచ్చి, ఆయన్ని సపోర్ట్ చేశారు. ఆయనికి బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. అందరికీ చాలా థాంక్స్’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!