Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం భార్య రహస్య (Rahasya) పండంటి బాబుకు (Baby Boy) జన్మనిచ్చారు. ఈ విషయం తెలుపుతూ కిరణ్ అబ్బవరం ట్విట్టర్ ఎక్స్ వేదికగా చిన్నారి కాళ్లను ముద్దాడుతూ ఉన్న ఫొటోని షేర్ చేశారు. మరో విశేషం ఏమిటంటే, హనుమాన్ జయంతి రోజు తనకు బాబు పుట్టాడని ఎంతో సంతోషంతో కిరణ్ అబ్బవరం ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేననేలా కిరణ్ అబ్బవరం సంబరంలో మునిగిపోయారనేది ఆయన చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన కిరణ్ అబ్బవరం అభిమానులు కంగ్రాట్స్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘హనుమాన్ జయంతి’ (Hanuman Jayanthi) రోజున కొడుకు పుట్టడం నిజంగా ఆ దేవుని ఆశీర్వాదంగా భావించాలి. ఈ పవిత్ర రోజున మీ కుటుంబానికి వచ్చిన ఈ చిన్నారి జీవితంలో ఎల్లప్పుడూ శక్తి, ఆనందం, ఆరాధన ఉండాలని కోరుకుంటున్నాం. మీ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలంటూ నెటిజన్లు కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..
కిరణ్ అబ్బవరానికి మ్యారేజ్ తర్వాత అదృష్టం కలిసొస్తుంది. పెళ్లికి ముందు ఆయన వరుస ప్లాప్‌లతో నిరాశలో ఉన్నారు. పెళ్లి తర్వాత ‘క’ సినిమా రూపంలో ఆయన బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని, ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఎప్పుడో చేసి, ఆగిపోయిన సినిమా కూడా విడుదలకు నోచుకుంది. ‘క’ (Ka Movie) సినిమా సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం స్టేటస్ మారిపోయింది. ఆయనకి కూడా టాలీవుడ్‌లో ఒక రేంజ్ అనేది ఏర్పడింది. ఇకపై కెరీర్‌ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటే మాత్రం ఆయన కూడా స్టార్ హీరోల జాబితాలోకి చేరడం తధ్యం. మల్టీ టాలెంట్ ఉన్న కిరణ్ అబ్బవరం కచ్చితంగా ఆ రేంజ్‌కి వెళతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
Blessed with a Baby Boy 😇
Happy Hanuman Jayanthi 🙏#Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025
Also Read- Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు
కిరణ్, రహస్యల విషయానికి వస్తే.. వారిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘రాజా వారు రాణి గారు’ (Raja Varu Rani Garu). 2019లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కిరణ్ సరసన రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన స్నేహం కాస్తా.. తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ఆగస్ట్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ‘మా ప్రేమ పెరుగుతోంది’ అంటూ పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని వీరిద్దరూ పబ్లిక్‌కి తెలియజేశారు. కిరణ్ అబ్బవరం, రహస్యల బాండింగ్ ఎలా ఉంటుందనేది ‘క’ మూవీ ప్రమోషన్స్‌లో అందరూ చూశారు. ఈ జంటకి ఇప్పుడో బుడతడు యాడయ్యాడు. కిరణ్, రహస్యలకు చెందిన ఇరు కుటుంబాలు ఈ విషయంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు