Mark Thriller: కిచ్చ సుదీప్ ‘మార్క్’ ట్రైలర్ చూశారా?..
mark-trailer(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mark Thriller: కిచ్చ సుదీప్ ‘మార్క్’ ట్రైలర్ చూశారా?.. యాక్షన్ ధమాకా అదిరిపోయిందిగా..

Mark Thriller: కన్నడ చిత్రసీమలో తనదైన ముద్ర వేసి, తెలుగులో కూడా ‘ఈగ’ వంటి చిత్రాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మార్క్’ (Mark). ఈ చిత్రం యొక్క అధికారిక ట్రైలర్ ఇటీవల విడుదలై, సుదీప్ అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. అత్యంత భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ సినిమా, యాక్షన్ ప్రియులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Read also-Shashirekha Song: ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ సాంగ్ వచ్చేసింది..

‘మార్క్’ సినిమాను రెండు ప్రతిష్టాత్మక బ్యానర్లు అయిన సత్య జ్యోతి ఫిల్మ్స్, కిచ్చ క్రియేషన్స కలిసి నిర్మించాయి. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ లు ప్రధాన నిర్మాతలుగా వ్యవహరించగా, సరవరన్, సాయి సిద్ధార్థ్ సహ-నిర్మాతలుగా బాధ్యతలు పంచుకున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన వి కార్తికేయ. సుదీప్ మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూ, కథను ఆసక్తికరమైన మలుపులతో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. సినిమాటోగ్రాఫర్ శెఖర్ చంద్ర విజువల్స్ చాలా రిచ్‌గా, డార్క్ టోన్‌లో ఉండి, యాక్షన్ థ్రిల్లర్ ఫీల్‌ను పక్కాగా ఇచ్చాయి. సంగీత దర్శకుడు అజనీష్ బి లోక్ నాధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలకు మరింత శక్తిని జోడించింది.

Read also-TV Premieres: ఈ రోజు టీవీలో ప్రసారం అయ్యే సూపర్ హిట్ సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి మరి..

ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ సుదీప్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉంది. సుదీప్ ఈ సినిమాలో ‘మ్యాక్స్’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా “మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి” అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ ను మెప్పించింది. సమాజంలోని వ్యవస్థ లోపాలపై పోరాటం, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకునే కథాంశం ఇందులో కనిపిస్తోంది. మొత్తంగా, సాంకేతిక నిర్మాణ పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ, దర్శకుడు కె కార్తికేయ రూపొందించిన ‘మార్క్’ చిత్రం యాక్షన్ సినిమా అభిమానులకు ఒక మాస్ ఫీస్ట్ అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు