Kiara Advani : బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ, ఆమె భర్త నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ జంటకు పండంటి బిడ్డ జన్మించిందని సోషల్ మీడియా ద్వారా వారు వెల్లడించారు. ఈ శుభవార్త తెలియగానే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కియారా-సిద్ధార్థ్ జోడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కియారా , సిద్ధార్థ్ వివాహం 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన వైభవోపేత వేడుకలో జరిగింది. వీరి ప్రేమకథ “షేర్షా” (2021) సినిమా సెట్స్‌లో మొదలైంది. ఈ చిత్రంలో కలిసి నటిస్తూ వీరిద్దరూ సన్నిహితంగా మారారు. అయితే, వీరి మొదటి పరిచయం “లస్ట్ స్టోరీస్” (2018) సినిమా ఎండింగ్ పార్టీలో జరిగింది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, 2019 నాటికి డేటింగ్ గురించి పుకార్లు షికారు చేశాయి. 2021లో ఇరు కుటుంబాలను ఒప్పించి, 2023లో వీరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.
Also Read: Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్
2025 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్‌లో కియారా తన బేబీ బంప్‌తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు, ఈ జంటకు బిడ్డ పుట్టిందనే శుభ వార్తతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కియారా ఫోటోలు, ఈ సంతోషకర క్షణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Ponnam Prabhakar: ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ స్థంస్థగత పునఃనిర్మాణం పై తుది కసరత్తు
కియారా అద్వానీ, బాలీవుడ్‌లో స్టార్ నటిగా గుర్తింపు పొందింది. తన ఆకర్షణీయమైన నటన, ఛాలెంజింగ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించి దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కియారా అద్వానీ స్టార్ హీరోస్ తో కూడా నటించింది.