Khaleja Re Release: ఖలేజా మూవీ సూపర్ స్టార్ మహేశ్ సినిమాల్లో వెరీవెరీ స్పెషల్. 2010లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా, తర్వాత ఫ్యాన్స్‌కు స్పెషల్ చిత్రంగా మిగిలిపోయింది. మే 30న ఈ మూవీ రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొన్నది. మహేశ్ బాబు రీ రిలీజ్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే వసూళ్లు కూడా దండిగా ఉంటాయి. ఖలేజా కూడా అదే స్థాయిలో నిలబడింది. అడ్వాన్స్ బుకింగ్ సేల్స్‌లో రికార్డ్ నెలకొల్పింది.
రీ రిలీజ్‌లలో మహేశ్ ట్రెండ్ సెట్టర్
పోకిరి, బిజినెస్‌మెన్, ఒక్కడు, భరత్ అనే నేను ఇలా రీ రిలీజ్ అయిన మహేశ్ ప్రతీ సినిమా రికార్డుల మోత మోగించాయి. ఈమధ్య మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు సరికొత్త ట్రెండ్స్ నమోదు చేశాయి. ఇప్పుడు ఖలేజా కూడా కలెక్షన్ల మోత మోగించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో మాస్ ర్యాంపేజ్‌ను సృష్టించింది. బుక్ మై షోలో ఇండియా వైడ్‌గా రూ.4.5 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. అలాగే, ఓవర్సీస్‌లో కూడా దుమ్ము దులిపింది. వరల్డ్ వైడ్‌గా రూ.5 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుని పాత రికార్డులను చెరిపేసింది. టాలీవుడ్ రీ రిలీజ్‌లలో ఖలేజా మూవీనే టాప్‌లో ఉన్నది.
Read Also- Parenting Tips: మీ ఇంట్లో అమ్మాయి ఉందా.. మీరు నేర్పించాల్సినవి ఇవే!
థియేటర్స్‌లో ఫ్యాన్స్ హంగామా
ఖలేజా రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. విజయవాడలోని ఓ థియేటర్‌లోకి పాము పట్టుకుని వచ్చాడు. సినిమాలో మహేశ్ బాబు పామును పట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ ఉంటుంది. దాన్ని అనుకరించడం కోసం పామును చేతిలో పట్టుకుని వచ్చాడు అభిమాని. మొదటి అది చూసిన వారు బొమ్మ పాము అనుకున్నారు. కానీ, చేతిలో ఉన్న పాము కదలడంతో నిజమైనదని భయబ్రాంతులకు లోనయ్యారు. పామును చేతిలోనే ఉంచుకున్న మహేశ్ అభిమాని స్క్రీన్ ముందుకు వెళ్లి నానా హంగామా సృష్టించాడు.
హాస్పిటల్ సీన్ రీ క్రియేట్
ఓ అభిమాని థియేటర్‌లో హాస్పిటల్ సీన్ రీ క్రియేట్ చేశాడు. పెషెంట్ మాదిరిగా గౌన్ వేసుకుని, చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకున్నాడు. మరో చేతిలో మొక్కని పట్టుకుని, దీన్ని ఎక్కడ పెట్టుకోను అంటూ డైలాగులు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఇలా ఒకటేమిటి, నువ్వు అనుకుంటే అవుద్ది సామా డైలాగ్, చిన్నారికి పేరు పెట్టే సీన్ ఇలా చాలా రీ క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ ఫైట్ తర్వాత పాదాభివందనం చేసే సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్లలో అభిమానులంతా చేతులెత్తి దండం పెట్టిన ఫోటో వైరల్ అవుతున్నది.
మహేశ్ పాత ట్వీట్ వైరల్
2010లో ఖలేజా రిలీజ్ సందర్భంగా మహేశ్ బాబు ఓ ట్వీట్ చేశారు. ‘మీ అందరిలాగే నేను కూడా ఖలేజా థియేటర్లను ఊపేస్తుందని ఎదురు చూస్తున్నా’’ అని పోస్ట్ పెట్టగా, ఇప్పుడు దానికి లైకుల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
Read Also- Weather Update: భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!