Keerthy Suresh: నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)పై కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఈవెంట్‌లో ‘చిరంజీవి, విజయ్‌లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?’ అని కీర్తి సురేష్‌ని మీడియా పర్సన్ అడిగినప్పుడు.. ‘విజయ్’ (Kollywood Hero Vijay) అంటూ ఆమె సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని మెగా ఫ్యాన్స్ హర్టయ్యారు. ఎందుకంటే, టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ కూడా చిరంజీవి డ్యాన్స్ గురించి ప్రశంసలు కురిపిస్తుంటుంది. డ్యాన్స్ అనే మాట వస్తే చిరంజీవి (Mega Star Chiranjeevi) తర్వాతే ఎవరైనా అనేలా ఒక స్టాండ్‌ని ఫిక్స్ చేశారు మెగాస్టార్. అలాంటిది, చిరంజీవి సరసన నటించిన కీర్తి.. అలా సమాధానం చెప్పేసరికి బాగా హర్టయ్యారు. ‘ఎవరో బెస్ట్ డ్యాన్సరో నీకు తెలియకపోతే.. మీ అమ్మను అడుగు’ అంటూ అప్పటి నుంచి ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఆమెపై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై, ట్రోలింగ్‌పై కీర్తి వివరణ ఇచ్చింది.
Also Read- Jani Master: జానీ మాస్టర్‌కు క్రియేటివ్ కొరియోగ్రాఫర్ అవార్డ్.. హేటర్స్ పరిస్థితేంటో?
హర్టయిన వారందరికీ సారీ..
కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita). జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం అండ్ జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. నవంబర్ 28న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అప్పటి కాంట్రవర్సీపై కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై నేను మెగాస్టార్‌తో డిస్కస్ చేశాను. ఆయనకే స్వయంగా చెప్పాను. నేను చిరంజీవి సార్‌ని ఎంతగా అభిమానిస్తానో ఆయనకు కూడా తెలుసు. ఆయన నాకు ఆల్‌టైమ్ ఫేవరేట్. మేము కలిసి చేసిన సినిమా సెట్స్‌లో సరదాగా మాట్లాడుకునే వాళ్లం. నీకు ఇష్టమైన హీరో ఎవరు?, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇలా ఆయన అడుగుతుండేవారు. నాకు విజయ్ డ్యాన్స్ ఇష్టమని సార్‌తో కూడా చెప్పాను. నేనని చెప్పకుండా ధైర్యంగా చెప్పావు అంటూ.. చాలా స్పోర్టివ్‌గా తీసుకుని అప్రిషియేట్ కూడా చేశారు. నేను అన్న మాటలకు మెగా ఫ్యాన్స్ హర్టై ఉంటే వాళ్లందరికీ సారీ చెబుతున్నాను. నా దృష్టిలో ఇద్దరూ (చిరు, విజయ్) లెజెండ్స్. గొప్ప నటులు.. చిరంజీవి సార్ మా అమ్మతో కూడా కలిసి నటించారు. ఆయనపై నాకెప్పుడూ గౌరవం ఉంటుంది’’ అని కాంట్రవర్సీకి చెక్ పెట్టారు.
ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిలిం
‘రివాల్వర్ రీటా’ సినిమా గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘‘అజయ్ ఘోష్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇందులో సునీల్ చాలా డిఫరెంట్ రోల్ చేశారు. అందరూ ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రాధిక చాలా చక్కని పాత్ర చేశారు. మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిలిం. ఇప్పటి వరకు చాలా డార్క్ కామెడీ సినిమాలు వచ్చాయి. కానీ ఇది ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ ఫిలిం. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఒక్క రోజులో జరిగే కథ. పాత్రలన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇందులో నటించిన అందరికీ ధన్యవాదాలు. టెక్నికల్‌గా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. చంద్రు ఈ సినిమాను పక్కా కమర్షియల్ సినిమాగా తీశారు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. వాళ్ళు ‘మహారాజా’ వంటి అద్భుతమైన సినిమాలు తీశారు. 28న వస్తున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

