Karthi Annagaru Vastharu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Annagaru Vastharu: కార్తి ‘వా వాతియార్’కు తెలుగు టైటిల్ ఫిక్స్.. భలే టైటిల్ పట్టారే!

Annagaru Vastharu: స్టార్ హీరో కార్తి (Karthi) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’ (Va Vaathiyar)కు తెలుగు టైటిల్ ఫిక్సయింది. సూర్య, కార్తి అన్నదమ్ములకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కార్తిని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా లైక్ చేస్తారు. కార్తికి స్టార్‌డమ్ ఇచ్చిందే తెలుగు ప్రేక్షకులు. ఈ విషయం స్వయంగా కార్తినే ఓ స్టేజ్‌పై చెప్పారు కూడా. తెలుగులో కూడా కార్తి చక్కగా మాట్లాడగలడు. తెలుగు ప్రేక్షకులు ఇష్టమా, తమిళ ప్రేక్షకులా అంటే.. ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తెలుగు ప్రేక్షకులే అని చెప్పారు కార్తి. అందుకు ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతుంది. కొన్ని సినిమాలు ఫెయిలైనా.. తెలుగులో మాత్రం కార్తికి మంచి మార్కెట్టే ఉంది. ఆ మార్కెట్ ఏంటో మరోసారి నిరూపించుకునేలా కార్తి తన తాజా చిత్రంతో రెడీ అవుతున్నారు.

Also Read- Shah Rukh Khan: ‘కింగ్ ఖాన్’ చదువులోనూ బ్రిలియంటే.. సోషల్ మీడియాలో షారుఖ్ మార్క్ షీట్ వైరల్!

టైటిల్ ఇదే..

కోలీవుడ్‌లో ‘వా వాతియార్’ పేరుతో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vastharu) అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ.. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకు రాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ‘అన్నగారు వస్తారు’ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ (Studio Green) బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా (K.E. Gnanavel Raja) నిర్మిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి (Nalan Kumarasamy) రూపొందిస్తున్నారు. ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు కూడా ఎంతో కీలకం. ఈ మధ్యకాలంలో తెలుగులో ఆమె చేసిన సినిమా ఏదీ సక్సెస్ కాలేదు. అందుకే ఈ సినిమాపైనే కృతి శెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఈ సినిమా తర్వాత మరోసారి టాలీవుడ్‌లో బిజీ నటిగా అవుతాననే నమ్మకంతో కృతి ఉందని తెలుస్తోంది.

Also Read- Chikoti Praveen: నీ పతనం ఖాయం.. రాజమౌళిపై చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోన్న ‘అన్నగారు వస్తారు’

ఈ సినిమాలో కార్తి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ‘అన్నగారు వస్తారు’ టైటిల్ పోస్టర్‌తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌ హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. కార్తి కెరీర్‌లో ‘అన్నగారు వస్తారు’ చిత్రం మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందనే నమ్మకాన్ని చిత్రయూనిట్ వ్యక్తం చేస్తోంది. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి కార్తి హిట్ బాట పడతాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో? ప్రస్తుతానికైతే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?

Minister Sridhar babu: ఏఐతో ఉద్యోగాలు పోతాయా.. ఇది కేవలం అపోహే: మంత్రి శ్రీధర్ బాబు

Bandi Sanjay: మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?

Annagaru Vastharu: కార్తి ‘వా వాతియార్’కు తెలుగు టైటిల్ ఫిక్స్.. భలే టైటిల్ పట్టారే!

Telangana Secretariat: సచివాలయం వద్ద ప్రమాదం.. గ్రిల్‌లో ఇరుక్కున ఉద్యోగిని కాలు