Karmastalam: బిగ్ బాస్ దివి (Bigg Boss Divi) పేరుకు పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న వారందరికీ ఆమె పరిచయమే. బిగ్ బాస్ ద్వారా మరింత మందికి ఆమె చేరువైంది. ఇక సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూసి కుర్రకారుకు మతిపోతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటి దివి ఇప్పుడో సినిమాలో యోధురాలిగా తన ధీరత్వం ప్రదర్శించబోతుంది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే నిర్మాతగా బిగ్ బాస్ దివి ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’ (Karmastalam). రాకీ షెర్మాన్ (Rocky Sherman) దర్శకత్వంలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేసి, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. ఇందులో దివిని ఓ యోధురాలిగా చూపిస్తూ వదిలిన ఈ న్యూ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
Also Read- Save the Tigers Season 3: టైగర్స్ వస్తున్నారు.. ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ గ్లింప్స్ చూశారా?
కదనరంగంలో యోధురాలిగా..
‘కర్మస్థలం’ మూవీ నుంచి వచ్చిన ఈ తాజా పోస్టర్‌ను గమనిస్తే.. బిగ్ బాస్ దివి (Divi Vadthya) ఇందులో కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు.. మొత్తం పీరియాడికల్ టచ్‌ని ఇచ్చేశాయి. పోస్టర్‌ను ప్రతీది డీటైల్‌గా అర్థమయ్యేలా డిజైన్ చేశారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Also Read- Ravi Teja BMW: అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. మెలోడీతో వచ్చిన మాస్ మహారాజా!
ఇలాంటి పాత్ర చేయాలని..
ఈ సినిమాకు శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తన లైఫ్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని దివి చెబుతున్నారు. అసలు ఇలాంటి ఒక సినిమా చేస్తానని తన లైఫ్‌లో అనుకోలేదని, కానీ ఇలాంటి పాత్ర చేయాలని చాలా కోరికగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తర్వాత తను బిజీ నటిగా మరిన్ని మంచి అవకాశాలు అందుకుంటాననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని దర్శకనిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

