Kareena Kapoor
ఎంటర్‌టైన్మెంట్

Kareena Kapoor: ఆ హీరోకు ప్రేమతో.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Kareena Kapoor: బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలు, ఫోటోలు, ఇష్టమైన వాటి గురించి తరచూ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ గురించి ప్రత్యేక పోస్ట్ పెట్టింది. అతనిపై తనకున్న ప్రేమను పంచుకున్నది. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతున్నది.

బ్రాడ్ పిట్‌పై పోస్ట్

హాలీవుడ్ నటుల్లో పేరు గాంచిన నటుడు బ్రాడ్ పిట్. 1987లో లెస్ దన్ జీరో, నో వే అవుట్, నో మ్యాన్స్ ల్యాండ్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత హీరోగా మారి హాలీవుడ్ టాప్ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి మన బాలీవుడ్ నటీనటుల్లో చాలామంది అభిమానిస్తుంటారు. వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు. అప్పుడప్పుడు అతనిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్ 1 మూవీ విడుదలైంది. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఎఫ్ 1పై బాలీవుడ్ ప్రముఖుల స్పందన

ఎఫ్ 1 మూవీలోని ఓ ఫోటోను పోస్ట్ చేసిన కరీనా, ‘‘60 ఏళ్ల వయసులోనూ ఇలా కనిపిస్తున్నారంటే, అందరూ 20 ఏళ్లు ఉండాలని కోరుకుంటారు’’ అని తెలిపింది. మూడు స్టార్ ఎమోజీలతోపాటు మూడు హార్ట్ ఎమోజీలను కూడా జత చేసింది. ఇది చూసిన కరీనా ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్య అనన్య పాండే కూడా ఎఫ్ 1 మూవీ చూస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మూవీ స్క్రీన్‌తోపాటు పాప్ కార్న్ టబ్ ఫోటోను పంచుకుంది. ‘‘నాకు బ్రాడ్ పిట్ అంటే చాలా ఇష్టం, సినిమాలు అంటే ఇంకా ఇష్టం, ఎఫ్ 1 అంటే చాలా ఇష్టం. పాప్ కార్న్ కూడా అంతే ఇష్టం’’ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ చిత్రాన్ని తిలకించాడు.

Read Also- SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై.. సింహం, పులి సీరియస్ డిస్కషన్.. వీడియో చూస్తే కడుపు చెక్కలే!

భారీ వసూళ్లు

హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఎఫ్ 1 ఒకటి. ఆపిల్ నుంచి వచ్చిన ఈ మూవీ ఆ సంస్థకు తొలి సక్సెస్ ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా ఏకంగా రూ.470 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రేసింగ్‌కు సంబంధించిన మూవీ కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. విమర్శకులు సైతం పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అయితే, 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను బ్రేక్ ఈవెన్ చేయడానికి ఈ వీకెండ్ చాలా కీలకం. సినిమా హిట్ టాక్ రావడంతో ఆపిల్ సంస్థ స్పందించింది. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. నటీనటులు, సిబ్బందిని కూడా ప్రశంసించింది. ఎఫ్ 1 సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉందని చెప్పింది.

Read Also- Munawar Faruqui: ఎట్టకేలకు రెండో పెళ్లి సీక్రెట్స్ రివీల్ చేసిన మునావర్ ఫారూఖీ

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?