kantara-mistaje(image ;X)
ఎంటర్‌టైన్మెంట్

Kantara 1 mistake: ‘కాంతార చాప్టర్ 1’లో ఈ సీన్ చూశారా.. దొరికేశారుగా..

Kantara 1 mistake: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 2022లో విడుదలైన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి వారంలోనే రూ. 500 కోట్లు దాటిన బాక్సాఫీస్ విజయం సాధించింది. అయితే, ఈ సినిమాలోని ఒక పాట సీన్‌లో కనిపించిన మోడరన్ ప్లాస్టిక్ వాటర్ క్యాన్, నెటిజన్లలో హాస్యాస్పద చర్చలకు దారితీసింది. ఇది 4వ శతాబ్ద కాలంలో జరిగే కథలో ఉండటం వల్ల, ఫ్యాన్స్ దీనిని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లోని ప్రసిద్ధ స్టార్‌బక్స్ కప్ బ్లండర్‌తో పోల్చుతున్నారు.

Read also-advance release date strategy: stoty: కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ముందే ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు?.. ఫ్యాన్స్ కోసమేనా?

పాటలో దాగిన ‘ప్లాస్టిక్ డబ్బా’

కాంతార చాప్టర్ 1’లోని ‘బ్రహ్మకళాశ’ పాట సీన్‌లో, కమ్యూనిటీ డైనింగ్ దృశ్యంలో 20-లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కనిపించడం గమనార్హం. ఈ చిత్రం 4వ శతాబ్దంలో కదంబ రాజవంశానికి చెందిన కథను చిత్రిస్తుంది, కానీ ఈ మోడరన్ ఐటమ్ సెట్‌లో తప్పుగా ఉండటం వల్ల ఫ్యాన్స్ దీనిని గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించి వీడియో
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో మరింత వైరల్ చేస్తున్నారు. ఒక యూజర్: “నేను కదంబులు మొదటి ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఉపయోగించారని తెలుసుకున్నాను అంటూ కామెంట్ చేశాడు. మరొకరు ఇది “బిస్లేరితో పెయిడ్ పార్ట్‌నర్‌షిప్ లాగా ఉంది! అంటూ రాసుకొచ్చారు. ఒక ఫ్యాన్ అయితే “ఈ మిస్‌ను చూడటం బాధాకరం ఎందుకంటే సినిమాలో చాలా కేర్, అటెన్షన్ టు డీటెయిల్ కనిపిస్తుంది…” అని బాధతో చెప్పుకొచ్చారు.

Read also-Srikanth Iyengar: ఆ నటుడిపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ.. చర్యలు తప్పవా?

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పోలికలు

దీనిని చూసిన చాలా మంది, 2019లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో జరిగిన స్టార్‌బక్స్ కప్ బ్లండర్‌ను గుర్తుచేసుకున్నారు. అక్కడ మధ్యయుగ కాలంలో జరిగే సీన్‌లో మోడరన్ కాఫీ కప్ యాక్సిడెంట్లీ కనిపించి, ఇంటర్నెట్‌లో భారీ చర్చకు దారితీసింది. అలాగే, ‘కంటారా’లోని ఈ ప్లాస్టిక్ క్యాన్ కూడా సినిమా ప్రొడక్షన్‌లో జరిగిన తప్పిదం‌గా పేరుపొందుతోంది. నెటిజన్లు దీనిని ‘కదంబులు మొదటి ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఉపయోగించారని తెలిసింది’ అని హాస్యంగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైన ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీలో ఇలాంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ లోపాలు ఉండటం సినిమాను ఆస్వాదించే వరికి కొంత నిరాశగానే ఉంటుంది. ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రాకార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటకే దాదాపు రూ.500 కోట్లుకు పైగా వసూలు చేసింది.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ