Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ మేకింగ్ వీడియో అదిరింది
Kantara Chapter 1
ఎంటర్‌టైన్‌మెంట్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ అప్డేట్.. మేకింగ్ వీడియో అదిరింది

Kantara Chapter 1: ‘రాజకుమార, కెజియఫ్, సలార్, కాంతార’ వంటి మైల్ స్టోన్ చిత్రాలతో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films), ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1)ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంతార’ ట్రెమండస్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై మాములుగా అంచనాలు లేవు. రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకొని, సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ని మేకర్స్ పంచుకున్నారు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు.

Also Read- Natti Kumar: ఫిష్ వెంకట్‌‌కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!

ఈ ‘కాంతార చాప్టర్ 1’ మేకింగ్ వీడియోను గమనిస్తే.. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్సైన ఈ వీడియో ఒక సినిమాటిక్ ఫెస్టివల్‌లా అనిపిస్తుండటం విశేషం. కేవలం బీహైండ్ ది సీన్స్ అనిపించకుండా.. ఈ సినిమా పుట్టిన తీరుని ఇందులో అద్భుతంగా చూపించారు. విభిన్న భూ భాగాలు, కాంప్లెక్స్ సెటప్‌లలో పనిచేసే భారీ టీమ్ కలిగి ఉన్న ఈ వీడియో.. రిషబ్ శెట్టి డెడికేషన్‌కు ట్రీబ్యూట్‌ అని చెప్పుకోవచ్చు. ఇక మేకర్స్ ఇచ్చిన మరో అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమా టాకీపార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న బి. అజనీష్ లోకనాథ్ ఆల్రెడీ తన స్పిరిచువల్ టచ్‌తో అద్భుతం అనిపించిన విషయం తెలియంది కాదు. డివోషనల్ విజువల్స్‌ను ఆర్ట్ డైరెక్టర్ వినేష్ బంగ్లాన్ డిజైన్ చేసిన తీరు, సినిమాటోగ్రఫీ విషయంలో అరవింద్ కాశ్యప్ వర్క్ మెస్మరైజ్ చేస్తున్నాయి.

Also Read- Nikhil Siddhartha: వాటర్ బాటిల్స్ ని కూడా లోపలికి తెచ్చుకోనివ్వరా.. హీరో నిఖిల్ సంచలన ట్వీట్

అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో గ్లోబల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా మరోసారి రికార్డులను షేక్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ‘కాంతార చాప్టర్ 1’తో హోంబాలే ఫిల్మ్స్ సంస్థ భారతీయ సినిమాలో సరిహద్దులను దాటే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది, స్టోరీ టెల్లింగ్, సినిమాటిక్ ఎక్సలెన్స్‌ను బ్లెండ్ చేసి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా ఇస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. ‘కాంతార’తో దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన రిషబ్ శెట్టి, ఇప్పుడు రాబోయే ‘కాంతార చాప్టర్ 1’తో ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేయబోతున్నారో, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నారో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయక తప్పదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి