Kannappa Twitter Review ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు హిట్ కొట్టాడా? లేదా?

Kannappa Twitter Review: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఈ రోజు విడుదలైంది. మోహన్ బాబు నిర్మించిన ఈ భారీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. గత పదేళ్లుగా విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం విష్ణు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. న్యూజిలాండ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇక వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, కాస్త ఆలస్యమైనప్పటికీ, ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Also Read: Swetcha Effect: 800 ఏళ్ల చరిత్ర చెరువును కాపాడిన స్వేచ్ఛ కథనం.. స్పందించిన గ్రామస్తులు!

‘కన్నప్ప’ గురించి ఇప్పటివరకు చాలా మంది సెలెబ్రిటీలు తమ రివ్యూలు ఇచ్చారు. అనేక షోలు, ప్రివ్యూలు పడటంతో విష్ణు మంచు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తనదే అని విష్ణు నమ్మకంగా చెప్పుకొచ్చారు. ట్విట్టర్ లో వస్తున్న టాక్ చూస్తే, తన నమ్మకం నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ యవరేజ్ గా ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని రిపోర్టులు వస్తున్నాయి.

Also Read: Telugu Heroes: ఆటో డ్రైవర్ గా మహేష్ బాబు.. జ్యూస్ అమ్ముతున్న హీరో రామ్ చరణ్.. వీడియో వైరల్

మంచు విష్ణు తన సినీ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే, అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ పెద్ద సర్ ప్రైజ్. ముఖ్యంగా, సినిమాలోని ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఇక క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటాయంటూ ఓ నెటిజన్ తన రేటింగ్ 3.5/5 ఇచ్చాడు.

ఇప్పుడే కన్నప్ప సినిమాని యూఎస్‌లో చూశాను. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది. మంచు విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది. ప్రభాస్ స్క్రీన్ టైం 17 నిమిషాల కంటే ఎక్కువే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ 3.5/5 రేటింగ్ ఇచ్చాడు.

Also Read: Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ