Kannappa Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

Kannappa Trailer: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27న రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మంచు విష్ణు అండ్ టీమ్ కొన్ని రోజులుగా పీక్స్‌లో నిర్వహిస్తున్నారు. యూఎస్‌ మొదలు పెట్టి.. భారత్‌లోని మ్యాగ్జిమమ్ రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్, పోస్టర్స్, ఇతరత్రా ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు. కొచ్చిలో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి లాలెట్టన్ మోహన్ లాల్ (MohanLal), బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగానే ఈ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Manisha Krystina: 2 వేల మంది అప్రోచ్ అయితే.. 500 మంది కమిట్‌మెంట్ అడిగారు!

ట్రైలర్ విషయానికి వస్తే.. విజువల్‌గా ఈ ట్రైలర్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. సినిమాలోని మెయిన్ పాత్రలన్నింటినీ ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. ‘దేవుడు లేడు, ఎవరూ లేరు’ అంటూ విష్ణు కుమారుడు (కన్నప్ప చిన్నప్పటి పాత్ర) ఒక రాయిని గాడ్‌పై విసిరే సీన్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. అది వట్టి రాయి రాయి అంటుంటే.. ఆ విసిరిన రాయిని పైలోకంలో ఉన్న శివుడు (అక్షయ్ కుమార్) చేతితో పట్టుకోవడాన్ని చూపించారు. వాయు లింగం కోసం తిన్నడిని, ఆడి గూడెన్ని, అడవుని నాశనం చేసి ఆ వాయు లింగాన్ని తెచ్చుకుంటా.. అనే విలన్ డైలాగ్‌తో చిత్ర కోర్ కాన్సెప్ట్‌ని రివీల్ చేశారు. ఆ తిన్నడు సామాన్యుడు కాదు.. అతడిని దాటి వాయు లింగాన్ని చేరడం అసాధ్యం అనే డైలాగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. మంచు విష్ణు పవర్ ఫుల్ ఎంట్రీ అదిరింది. వాయు లింగం కోసం అనేక మంది ప్రయత్నిస్తుండటం, దానిని కాపాడేందుకు మోహన్ బాబు ప్రాణాలైనా అర్పిస్తానని చెబుతుండటం చూస్తుంటే.. ఈ సినిమా దేనిని బేస్ చేసుకుని తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఈ గూడెంలో ఏ బిడ్డకు ఆపద రానివ్వను.. ఇది తిన్నడి ఆన’ అనే మంచు విష్ణు పవర్ ఫుల్ డైలాగ్.. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. రుద్రగా ప్రభాస్ పాత్రని ఇంట్రడ్యూస్ చేసిన తీరు, ఆ తర్వాత వచ్చే సీన్లు అన్నీ కూడా.. సినిమాపై హైప్ పెంచేలా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ‘శ్రీ మంజునాథ’ చిత్రాన్ని తలపించినా, స్టోరీ పరంగా అందరికీ తెలిసిన కథే అయినా, ‘కన్నప్ప’ కనెక్ట్ అయ్యేలానే ఉన్నాడు. చూద్దాం.. జూన్ 27న ఏం జరగబోతుందో..

Also Read- Baba Vanga: అత్యంత భయానకంగా 2025.. ఆ రోజే మానవ జాతి అంతం.. బాబా వంగా జోస్యం

అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మించిన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా  చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా అరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. అలాగే మంచు ఫ్యామిలీ నెక్ట్స్ వారసుడు ఆవ్రామ్ కూడా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారంతా ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమా జనాల్లోకి బాగానే రీచ్ అవుతోంది. మరి మంచు ఫ్యామిలీకి చాలా కాలంగా దూరమైన హిట్.. ఈ సినిమాతో అయినా వస్తుందేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?