Mohan Babu in Kannappa Movie (Image Source: Twitter X)
ఎంటర్‌టైన్మెంట్

Mohan Babu: ‘కన్నప్ప’ మూడో పాట.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతం ఎప్పుడంటే?

Mohan Babu Manchu: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం నుంచి ఈ సోమవారం సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి, ప్రతి సోమవారం చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సోమవారం మేకర్స్ ఏం అప్డేట్ ఇస్తారో అని అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. అలా వేచి చూసే వారి కోసం చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చింది. అదేంటంటే..

Also Read- Director Supreet Krishna: గతం, వర్తమానం, భవిష్యత్‌ తెలిసిన కార్‌స్కూటర్.. ‘టుక్ టుక్’ సీక్రెట్ చెప్పేసిన దర్శకుడు

మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించడమే కాకుండా.. ‘మహాదేవ శాస్త్రి’ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఇటీవల వచ్చిన టీజర్‌లో కూడా మోహన్ బాబుకు స్పేస్ కల్పించారు. ఇప్పుడు ఆయనపైనే ఇందులో ప్రత్యేకంగా ఓ గీతాన్ని రూపొందించినట్లుగా తెలుపుతూ.. ఆ గీతాన్ని విడుదల చేసే తేదీని రివీల్ చేశారు. అందుకు కూడా ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం విశేషం.

అవును.. మోహన్ బాబు పుట్టినరోజైన (Mohan Babu Birthday) మార్చి 19న ‘మహాదేవ శాస్త్రి పరిచయ గీతం’ (Mahadeva Shastri Intro Song)ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ, మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి అవతార్‌లో నడిచి వస్తున్నారు. ఆయన ఆహార్యం, నడక అన్నీ కూడా చాలా సీరియస్‌గా ఉన్నాయి. ఈ పాట ఈ సినిమాకు ప్రాణం అని మేకర్స్ చెబుతున్నారు. ‘కన్నప్ప’ దశ, దిశను మార్చే మహాదేవ శాస్త్రిగా ఇందులో మోహన్ బాబు కనిపించనున్నారు. అందుకే ఆయనపైనే ప్రత్యేకంగా మేకర్స్ పాట రూపకల్పన చేసినట్లుగా టాక్.

విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్ (Rebel Star Prabhas), మోహన్ లాల్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రలను పోషించారు. సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ (Stephen Devassy) స్వరపరిచిన పాటలు ఇప్పటికే శ్రోతలను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా రాబోతున్న మహ దేవ శాస్త్రి పరిచయ గీతం కూడా శ్రోతలను మెప్పిస్తుందని, ఈ పాటను రెగ్యులర్‌గా కాకుండా చాలా వైవిధ్యంగా సంగీత దర్శకుడు కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read- Chhaava: ‘బలగం’ తర్వాత మళ్లీ ‘ఛావా’కే.. సక్సెస్‌కు కొలమానం ఇదే!

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?